
ఫొటోలో ఉన్నవాళ్లు ఏదో సంగీతానికి అనుగుణంగా సంతోషంగా చిందులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు కదా! సంగీతం వింటూ సంతోషంగా చిందులు వేయడం మామూలే కదా అనుకుంటున్నారా? మామూలే అనుకోండి. కాని, ఈ ఫొటోలో కనిపిస్తున్న వాళ్లంతా బధిరులు. అయితే, వాళ్లు సంగీతానికి అనుగుణంగానే చిందులు వేస్తున్నారు. బధిరులు సంగీతానికి అనుగుణంగా చిందులు వేయడమేంటని అవాక్కవుతున్నారా? ఫొటోను జాగ్రత్తగా గమనించండి.
వాళ్ల ఒంటిపై ముందువైపు కనిపిస్తున్న స్ట్రాప్స్ వెనక్కు వేలాడేలా భుజాన తగిలించుకున్న బ్యాగులవి కావు. ఇవి వాళ్లు తొడుక్కున్న ‘హాప్టిక్ సూట్’కు చెందినవి. చేతి మణికట్లకు, ఒంటికి అంటిపెట్టుకునేలా ఉండే ఈ స్ట్రాప్స్‌తో కూడిన సూట్‌ను ధరిస్తే, ఈ సూట్ సంగీతానికి అనుగుణమైన ప్రకంపనలు సృష్టిస్తుంది. దాంతో బధిరులూ సంగీతాన్ని అనుభూతించగలరు. దీనిని ‘వోడాఫోన్’ కంపెనీ రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment