
న్యూఢిల్లీ: 5జీ సర్వీసులకు సంబంధించి నెట్‌వర్క్ భద్రత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్‌బీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతమున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సెన్సార్లు ఏవీ కూడా భద్రత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2021 సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు.
ఈ నేపథ్యంలో 5జీని అందుబాటులోకి తేవడంలో సైబర్ భద్రతకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం, ఆపరేటర్లు అంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సింగ్ పేర్కొన్నారు. 5జీ సేవలను విజయవంతంగా అందుబాటులోకి తేవాలంటే స్పెక్ట్రం ధర సముచితంగా అవసరమన్నారు.
చదవండి: జనవరిలో 5జీ ‘టెస్ట్‌బెడ్’