deaf person
-
బధిరులకూ సంగీతానుభూతి...
ఫొటోలో ఉన్నవాళ్లు ఏదో సంగీతానికి అనుగుణంగా సంతోషంగా చిందులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు కదా! సంగీతం వింటూ సంతోషంగా చిందులు వేయడం మామూలే కదా అనుకుంటున్నారా? మామూలే అనుకోండి. కాని, ఈ ఫొటోలో కనిపిస్తున్న వాళ్లంతా బధిరులు. అయితే, వాళ్లు సంగీతానికి అనుగుణంగానే చిందులు వేస్తున్నారు. బధిరులు సంగీతానికి అనుగుణంగా చిందులు వేయడమేంటని అవాక్కవుతున్నారా? ఫొటోను జాగ్రత్తగా గమనించండి. వాళ్ల ఒంటిపై ముందువైపు కనిపిస్తున్న స్ట్రాప్స్ వెనక్కు వేలాడేలా భుజాన తగిలించుకున్న బ్యాగులవి కావు. ఇవి వాళ్లు తొడుక్కున్న ‘హాప్టిక్ సూట్’కు చెందినవి. చేతి మణికట్లకు, ఒంటికి అంటిపెట్టుకునేలా ఉండే ఈ స్ట్రాప్స్‌తో కూడిన సూట్‌ను ధరిస్తే, ఈ సూట్ సంగీతానికి అనుగుణమైన ప్రకంపనలు సృష్టిస్తుంది. దాంతో బధిరులూ సంగీతాన్ని అనుభూతించగలరు. దీనిని ‘వోడాఫోన్’ కంపెనీ రూపొందించింది. -
సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్‌పాత్‌పై కూర్చొని నిరసన తెలిపాడు. माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG — Virender Singh (@GoongaPahalwan) November 10, 2021 ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్‌కు వినబడదు, మాట్లాడలేడు. చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’
లండన్: ఇటీవల కాలంలో అందరూ ఉబర్, ఓలా, ఆన్లైన్ రైడ్ యాప్‌ల ద్వారా క్యాబ్‌లు బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. దీంతో మనకు ప్రయాణం చాలా సౌకర్యవంతంగానూ మంచి వెసులబాటుగానూ ఉంటుంది. మంచి రద్దీ సమయంలో ఈ క్యాబ్‌ల సాయంతో త్వరితగతిన వెళ్లవచ్చు. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) అయితే మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్ మనల్ని పికప్ చేయించుకుని పాయింట్‌కి రీచ్ కాకపోతే వెంటనే సదరు డ్రైవర్‌కి కాల్ చేసి అడుగుతాం. కానీ కొంతమంది డ్రైవర్‌తో మాట్లాడటం ఇష్టం లేకనో లేక మరో ఇతర కారణాలతోనో కేవలం మెసేజ్‌లను పెడతారు. కానీ కొంతమంది డ్రైవర్లు ప్రయాణికులతో మాట్లాడలేని వైకల్యంతో బాధపడే వాళ్లు ఉంటారని మనకు తెలియదు. అచ్చం అలాంటి పరిస్థతిలో లండన్‌కి చెందిన ఉబర్ డ్రైవర్ ఓనూర్ ఉన్నాడు. వివరాల్లోకెళ్లితే....లండన్‌కి చెందిన జెరెమీ అబాట్ అనే వ్యక్తి ఉబర్ క్యాబ్‌ని బుక్ చేసుకుని ఎక్కుతున్నప్పుడు ఆ ఉబర్ డ్రైవర్ సీటుకి వెనుకవైపు ఉన్నఒక చక్కటి సందేశంతో కూడిన లెటర్ని చూసి ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఆ లెటర్లోని సందేశం ఏమిటంటే " నేను చెవిటివాడిని కాబట్టి మీరు నాకు ఏదైనా చెప్పవలసి వస్తే, దయచేసి ఫోన్లో టెక్స్ట్ చేయండి లేదా నేను కారు ఆపినప్పుడు నాకు చూపించడానికి మీరు నోట్‌ప్యాడ్‌లో వ్రాయవచ్చు. మీరు మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి ఏయూఎక్స్ కేబుల్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజు మీరు ఏం కావల్సిన బాస్‌లా అడగండి చేస్తాను. ఈ ట్రిప్‌ని నేను కూడా మీతోపాటు ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. అంతేకాదు మీరు నాతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు." అని ఉంది. దీంతో జెరెమీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తాను తన జీవిత కాలంలో ఎక్కిన ఉబెర్ క్యాబ్‌ల కంటే ఈ క్యాబ్ తనకు ప్రత్యేకం అని చెప్పాడు. ఈ మేరకు జెరెమీ ఈ ఉబర్ డ్రైవర్ సందేశంతోపాటు ఓనూర్ గ్రేట్ హిరో అంటూ ట్యాగ్లైన జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్ల ఈ సందేశం ఎంత హృదయపూర్వకంగా ఉందో అంటూ ఓనూర్ కష్టపడేతత్వాన్ని, మర్యాదపూర్వక స్వభావాన్ని ప్రశంసిస్తు ట్వీట్ చేశారు. (చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి) I have just entered the most wholesome Uber of my entire life. Big ups, Onur, absolute hero ❤️ pic.twitter.com/lID9Mn7pqF — Jeremy Abbott (@Funster_) October 21, 2021 -
ఫోర్న్ వీడియోలు ఆస్వాదించలేకపోతున్నా
న్యూయార్క్ : ఫోర్న్ వీడియోలను ఆస్వాదించలేకపోతున్నానంటూ ఒక దివ్యాంగుడు మూడు ఫోర్న్ వెబ్సైట్లపై పిటిషన్ దాఖలు చేసిన వింత ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన యారోస్లావ్ సూరిస్ పుట్టకతోనే చెవిటివాడు. తాము చెవిటివాళ్లం కావడంతో అశ్లీల వీడియోలకు క్యాప్షన్ లేకపోవడం వల్ల సాధారణ మనుషుల్లాగా వీడియోను ఎంజాయ్ చేయలేకపోతున్నాం అంటూ గురువారం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఫోర్న్ వీడియోలు ప్రసారం చేసే ఫోర్న్ హబ్, రెడ్ ట్యూబ్, యూ ఫోర్న్ వెబ్సైట్లతో పాటు కెనెడియన్ పేరెంటింగ్ కంపెనీ మైండ్గ్రీక్పై కేసు నమోదు చేశాడు. అంతేగాక ఈ వెబ్సైట్లు అమెరికన్ వికలాంగుల చట్టాన్ని ఉల్లఘించి తమపై వివక్షతను చూపారంటూ సూరిస్ పిటిషన్లో పేర్కొనడం గమనార్హం. 'ఫోర్న్ వీడియోలకు క్యాప్షన్ లేకపోతే దివ్యాంగులు వీడియోను ఎలా చూడగలరు. ఒక సాధారణ మనుషుల్లాగా మేము వీడియోనూ చూడలేమంటూ' 23 పేజీల పిటిషన్లో సూరిస్ తెలిపాడు. ఫోర్న్ వెబ్‌సైట్స్‌లో క్లోజ్డ్ క్యాప్షన్స్‌ను జత చేయాలని తాను కోరుతున్నట్లు సూరిస్ పేర్కొన్నాడు. ఇదే విషయమై ఫోర్న్‌హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరీ ప్రైస్ స్పందిస్తూ.. తమ వైబ్సైట్లో క్లోజ్డ్ క్యాప్షన్ ఆప్షన్ ఉందని, దానిని ఎంచుకోవాలంటే అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపారు. -
ఎయిర్‌హోస్టెస్ చేసిన పనికి ప్రశంసలు
వికలాంగులు అంటే మనలో చాలా మందికి ఎంతో చిన్న చూపు. వారికి సాయం చేయాల్సింది పోయి చీదరించుకుంటారు చాలా మంది. ఇక ప్రయాణాల్లో అయితే వేరే చెప్పక్కర్లేదు. సాయం చేయకపోగా సూటి పోటీ మాటలంటూ వారిని బాధపెట్టేవారిని నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఓ వికలాంగురాలి పట్ల ఓ ఎయిర్‌హోస్టెస్ చూపించిన కేర్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంది. ఈ సంఘటన డెల్డా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎండీవర్ విమానంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఆష్లే అనే యువతి ఎండీవర్ విమానంలో ప్రయాణించింది. అయితే ఆమెకు వినికిడి లోపం ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఎయిర్‌హోస్టెస్ జన్నా, ఆష్లేకి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో.. ఓ కాగితం మీద విమానంలో ఉన్న సౌకర్యాల గురించి రాసిచ్చింది. ‘దానిలో హాయ్ ఆష్లే.. ఈ రోజు నేను ఈ ఫ్లైట్ అటెండెంట్‌ని. నీవు కూర్చున్న సీటు పై భాగంలో అనగా నీ తలపైన రెండు బటన్లు ఉన్నాయి. వాటిలో పసుపుపచ్చది లైట్‌ని కంట్రోల్ చేస్తుంది. నీకు నాతో ఏమైనా అవసరం ఉంటే బూడిదరంగులో పెద్దగా ఉన్న బటన్‌ను ప్రెస్ చేస్తే నేను నీ దగ్గరకు వస్తాను. అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. నీ వెనకే ఉన్న ఎక్జిట్ బటన్‌ను ప్రెస్ చేయ్. నీకు ఏ సాయం కావాలన్న నన్ను అడుగు. మొహమాట పడకు’ అంటూ కాగితం మీద రాసిచ్చింది. దీన్ని ఆష్లే తల్లి తన ట్విటర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది. జన్నా మంచిమనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. My daughter who is Deaf took a flight by herself ! The attendant handed her this note on the plane ! Delta makes it amazing! @Delta pic.twitter.com/KQGVBq9uVC — bostonober (@oberlynn13) July 6, 2019 -
గెలిస్తే దేశంలోనే తొలి వ్యక్తి
భోపాల్ : అంతా అనుకున్నట్లు జరిగితే మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. ప్రజల తీర్పు అనుకూలంగా ఉంటే దేశంలోనే తొలిసారి ఓ మూగ-చెవిటి వ్యక్తి చట్టసభల్లో అడుగుపెట్టనున్నారు. అవును సుదీప్ శుక్లా అనే మూగ, చెవిటి వ్యక్తి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. నెలకు లక్ష రూపాయలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకోని మరి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఇప్పటి వరకు పనిచేసిన సుదీప్ శుక్లా.. దివ్యాంగులపై జరుగుతున్న అఘాయిత్యాలు.. ముఖ్యంగా మూగ, చెవిటి వారి పట్ల జరిగిన దురాగతాలతో కలత చెందారు. దీంతో ఉద్యోగం మానేసి ఆయా వర్గాల ప్రజల తరుపున పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో విభిన్న వర్గాలకు అవకాశం కల్పించిన మధ్యప్రదేశ్.. తనకు కూడా మంచి అవకాశం కల్పిస్తోందని సుదీప్ శుక్లా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి ఓ హిజ్రా తొలిసారి ఎమ్మెల్యేగా గెలువగా.. ఓ అంధుడు మొదటిసారి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. శాబ్నమ్ మౌసీ అనే హిజ్రా 1998 అసెంబ్లీ ఎన్నికల్లో సోహగపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా గెలిచి తొలి హిజ్రా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించాడు. యమునా ప్రసాద్ శాస్త్రి అనే అంధనేత (1977, 1989) రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎమ్మెస్సీ (ఐటీ) పట్టభద్రుడైన సుదీప్ శుక్లా తొలి మూగ చెవిటి ఎమ్మెల్యే కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. సుదీప్‌కు దివ్యాంగుల కోసం ఎన్జీవోను నడుపుతున్న గ్యానేంద్ర పురోహిత్ మద్దతిస్తున్నారు. అతని ప్రచారం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూగ-చెవిటి ప్రజాప్రతినిధులు వస్తారని గ్యానేంద్ర తెలిపారు. తొలి ఆసియా చెవిటి ఎంపీ అయిన నెపాల్ దేశస్థుడు రాఘవ్ బిర్ జోషి, ప్రపంచ తొలి మూగ, చెవిటి ఎంపీ ఎన్దీజ్ అలెక్స్(ఉగాండ), న్యూజిలాండ్ తొలి మూగ, చెవిటి ఎంపీ మోజో సెలెస్ట్ మాథర్స్లు సుదీప్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారన్నారు. మరో వెయ్యిమంది దివ్యాంగ కార్యకర్తలు సుదీప్ గెలుపు కోసం కృషి చేయనున్నారని పేర్కొన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మూగ, చెవిటి వ్యక్తులు లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారని, అలాగే ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వీటిని చూడలేక సుదీప్ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. చట్టసభల్లో పాత్రినిథ్యం వహించేలా దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, లేకపోతే నామినేషన్ పద్దతిలోనైనా అవకాశం కల్పించాలని సుదీప్ శుక్లా డిమాండ్ చేస్తున్నారు. తేనటీగలు పూల మకరంధాన్ని పీల్చుకున్నట్లు రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును దోచేస్తూ సమాజాన్ని కలుషితం చేశారని ఆరోపించారు. తనకు అవకాశం కల్పిస్తే నీటి శుద్ది చేసే యంత్రంలా.. సామజాన్ని శుద్ది చేస్తానని తెలిపారు. సుదీప్ భార్య కూడా మూగ, చెవిటియే. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. భర్త ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వస్తుండా ఆమె మాత్రం ఉద్యోగం చేస్తూ సుదీప్‌కు కుటుంబానికి అండగా ఉంటున్నారు. ఈ దివ్యాంగుడి కల నెరవేరాలని అందరు కోరుకుంటున్నారు. -
రాములు వచ్చేదెట్టా?
సత్తుపల్లి : మతి స్థిమితం సరిగ్గా లేక, మూగ, చెవిటి వైకల్యంతో ఉన్న ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కంచపోగు పెద్దరాములు అదృశ్యమై ఏడాది కాలం తర్వాత..అతను రాజస్తాన్ రాష్ట్రంలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చక్కర్లు కొట్టడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు అతడిని రప్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన ఇతను అవివాహితుడు. 70 ఏళ్ల వయస్సులో..గతేడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు చాలా చోట్ల వెతికినా ప్రయోజనం కన్పించలేదు. అప్పట్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. శుభకార్యాల్లో వంటలు చేస్తూ జీవించేవాడు. అయితే..పరిశుభ్రత అంటే..చాలా ఇష్టమని, ఎక్కడ చిన్న చెత్తకాగితం కనిపించినా తీసి పక్కకు వేస్తుంటాడని, శుభకార్యాలప్పుడు వచ్చి పరిసరాలను పరిశుభ్రం చేస్తుంటాడని, స్థానికంగా సుపరిచితుడని ఇక్కడివారు చెబుతున్నారు. ఈక్రమంలో రెండురోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్దరాములు రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ ప్రాంతలో ఉన్నట్లు వచ్చింది. రాజస్తాన్ పత్రికలో తన వారి కోసం వృద్ధుడి ఆరాటం.. పేరిట కథనం కూడా ప్రచురితమైంది. తెలుగువాడు అయినందున సోషల్ మీడియాలో తెలుగు వాళ్లందరికీ పోస్టు చేశారు. ఈ ప్రాంతంలోని కొందరు గుర్తించడంతో పెద్దరాములు రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో ఉన్నట్లు వెలుగుచూసింది. కలెక్టర్, సీపీకి వినతి.. రాజస్తాన్ రాష్ట్రం నుంచి కంచపోగు పెద్దరాములును తీసుకొచ్చేందుకు సహకారం అందించాలని బంధువులు కలెక్టర్ లోకేష్‌కుమార్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌లను కలిసి వేడుకున్నారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దరాములును అప్పగించాలని కోరారు. -
వినికిడే అతడి పాలిట శాపం
సోంపేట/కాశీబుగ్గ : ఆ కుటుంబంలో పెద్ద దిక్కు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో తన రెక్కల కష్టంపై తల్లిని పోషిస్తున్న కుమారుడు రైలు ప్రమాదంలో మృతిచెందడంతో ఆమె రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారకరమైన ఘటన కంచిలి మండలం జె.శాసనాం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దున్న హేమావతి భర్త పరుశురాముడు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమెకు కుమార్తె మీనాక్షికి వివాహమైంది. కుమారుడు తారకేశ్వరరావు (26) ఇంటి వద్ద ఉంటూ తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. మిగిలిన సమయాల్లో కూలీకి వెళ్తూ తల్లిని పోషిస్తున్నాడు. ఇతడికి చిన్న వినికిడి సమస్య ఉంది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సోంపేట మండలంలోని లక్కవరం గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్ అవతల పొలం ఉంది. ఆదివారం మధ్యాహ్నం పొలాన్ని చూసేందుకు ట్రాక్ దాటున్నాడు. ఇదేక్రమంలో విశాఖ నుంచి వస్తున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను గమనించకపోవడంతో ఢీకొంది. దీంతో ఎడమచేయి తెగిపడి తీవ్రంగా గాయపడగా పలాస ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. ఆశలదీపం ఆరిందని... తన కాయకష్టంతో స్వంత ఇల్లు నిర్మాణం పనులు చేపడుతున్నాడు. ఇటీవల వివాహ నిమిత్తం కొద్దిరోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలో ట్రైన్ రూపంలో మృత్యువు కబళించడంతో అతడి తల్లి గుండెలవిసేలా రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈ మేరకు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పలాస రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్కటైన మూగ మనసులు
ఇల్లంతకుంట(మానకొండూర్) : మండల కేంద్రానికి చెందిన మామిడి అంజయ్య ఏకైక కూతురు అనూష పుట్టు మూగ, కరీంనగర్‌కు చెందిన అర్జున్ అనే యువకుడు కూడా పుట్టు మూగ. మండల కేంద్రంలోని వైశ్యభవన్‌లో పెద్దల సమక్షంలో అనూష, అర్జున్ గురువారం వివాహం చేసుకున్నారు. మానకొం డూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొంకటి అనీల్ నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అజయ్‌వర్మ మాట్లాడుతూ ఇద్దరు మూగ వారు కావడంతో వారికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కోరారు. -
ఆ చిట్టిబాబుకు బ్రెయిలీ లిపి ఇచ్చారు!
ఇల్లినాయిస్ : ఒక్కోసారి మనం చేసే చిన్న పొరపాట్ల వలన నవ్వులపాలు కావాల్సి వస్తుంది. అమెరికన్ మోడల్, నటుడు నైల్ డామార్కోకు ఇల్లినాయిస్ ఎయిర్‌పోర్టులో వింత అనుభవం ఎదురైంది. వినికిడి లోపం ఉన్న ఈ నటుడికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని భావించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది చేసిన పొరపాటు ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తోంది. నైల్‌కు ప్రత్యేకంగా సహాయం చేసేందుకు.. ఆయనకు బ్రెయిలీ లిపిలో ఉన్న సేఫ్టీ మాన్యువల్ అందించారు. సరిగ్గా చెవులు వినపడని తనకు బ్రెయిలీలోని సెఫ్టీ మాన్యువల్ ఎలా ఉపయోగపడుతుందో అర్థంకాక ఆయన తల గోక్కున్నారు. ఇదే విషయాన్ని నైల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘వారు నాకు బ్రెయిలీ లిపిలో ఉన్న సేఫ్టీ మాన్యువల్ అందించారు. ఎందుకంటే నేను చెవిడివాడిని. ఇది పిచ్చితనమే కదా.. నేను వినలేను అంటే దాని అర్థం నాకు బ్రెయిలీతో అవసరం ఉందని కాదు’ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఇదివరకు ఎన్నోసార్లు తాను ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని, ఇది వారికి కొత్తేంకాదని తెలిపాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. -
దారుణం : అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి..
సాక్షి, లక్నో: సాధారణ కూలీ.. ఎదుటి వారికి ఏమీ చెప్పలేడు. తనకు ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అతనో మూగ, చెవిటితో బాధపడే దివ్యాంగుడు. అలాంటి వాడిని దొంగతనం నేరం మోపి చిత్రవధ పెట్టాడు అతని యజమాని. చెప్పుకోలేని విధంగా హింసించాడు. శరీరంలోని అతి సున్నిత భాగాలకు సైతం కరెంట్ షాక్ ఇచ్చి నరకం చూపించాడు. అనంతరం ఎవరీ తెలియకుండా ఊరికి దూరంగా పడేసి వచ్చాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఉత్తరప్రదేశ్‌లోని షహజహనాపూర్కు చెందిన కమలేష్ కుమార్ చెవుడు, మూగతో బాధపడే దలిత దివ్యాంగుడు. ఇతను యోగేష్ వర్మ అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. అయితే గత గురువారం పనికి వెళ్లిన కమలేష్ కనిపించకుండా పోయాడు. శుక్రవారం ఉదయం కొత్తబస్తీ ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అనంతరం మెలుకువ వచ్చి ఇంటికి చేరుకొని యజమాని తనని ఏవిధంగా హింసించాడో కుటుంబ సభ్యులకు తనదైన శైలిలో వివరించాడు. డబ్బు దొంగతనం చేశాడనే అనుమానంతో కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టినట్లు చెప్పాడు. అంతేకాకుండా శరీరంలోని సున్నిత భాగాలకు విద్యుత్ షాక్ ఇచ్చి చిత్ర హింసలు పెట్టారని రోదించాడు. స్పృహ తప్పిపడిపోయిన తనను దూరంగా తీసుకువచ్చి పడేశాడని వాపోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కమలేష్ శరీరంపై కాలిన మచ్చలు ఉన్నాయని, అతడిని తీవ్రంగా హింసించారని పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు యజమాని యోగేష్ వర్మపై ఐపీసీ 323తోపాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు. -
మీ సాయం జన్మలో మరచిపోలేమన్నా..
కర్నూలు: పుట్టుకతోనే మూగ, చెవుడు అయిన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వెల్తుర్ల చినఓబులేసు, రాణమ్మ దంపతుల కుమారుడు సందీప్‌కు రూ.7 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉచితంగా చేయించారు. తమ బిడ్డకు వినికిడి శక్తి వచ్చిందంటూ ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఆదివారం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
పిలిస్తే రాలేదని.. కుమ్మేశారు!
ఎక్కడ అన్యాయం జరిగినా.. ప్రమాదం జరిగినా.. చటుక్కున ప్రత్యక్షం కావాల్సింది పోలీసులే. ప్రజలకు పక్షాన తామున్నామంటూ భరోసా ఇవ్వాల్సిన ఆ రక్షకభటులే రాక్షసుల్లా ప్రవర్తిస్తే.. ఎవరికీ చెప్పుకోవాలి? నెల్లూరు జిల్లా కావలి వన్‌టౌన్ పోలీసులు చేసిన నిర్వాకం ఘోరంగా ఉంది. ఓ చెవిటి వాడిని అకారణంగా చావబాదారు. కావలికి చెందిన అహ్మద్ అనే వ్యక్తికి చెవుడు ఉంది. సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వన్‌టౌన్ పోలీసులు ఇద్దరు అతనికి తారసపడ్డారు. ఆ వ్యక్తిని దగ్గరకు రమ్మని పిలిచారు. చెవుడు ఉండటంతో వాళ్ల మాటలు అహ్మద్‌కు వినపడలేదు. దాంతో ఖాకీలకు కోపమొచ్చింది. పిలిస్తే పలకవా అంటూ.. అమాంతం అతడిపై విరుచుకుపడి ఇష్టమొచ్చినట్టు చావబాదారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అహ్మద్ తల్లి.. తన బిడ్డను కొట్టవద్దంటూ పోలీసులను ప్రాధేయపడింది. అయినా.. ఖాకీలు కనికరించలేదు. ఆమె మాట వినకుండా అతన్ని కుళ్లబొడిచారు. దాంతో తీవ్రగాయాలైన అహ్మద్‌ను కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి తల్లి చికిత్స చేయిస్తోంది. తన కుమారుడిని ఎందుకు కొట్టారో అర్థం కావటం లేదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.