
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్‌పాత్‌పై కూర్చొని నిరసన తెలిపాడు.
माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG
— Virender Singh (@GoongaPahalwan) November 10, 2021
ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్‌కు వినబడదు, మాట్లాడలేడు.
చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన