Virender Singh
-
నా సోదరి సాక్షిని చూసి గర్విస్తున్నా! చెప్పేదేమీ లేదన్న మంత్రి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టార్ రెజ్లర్లు. వీరికి బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా బాసటగా నిలిచాడు. తనకు లభించిన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించాడు. సాక్షిని చూసి గర్విస్తున్నా డెఫ్ ఒలింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో స్వర్ణ విజేతగా నిలిచిన వీరేందర్ ‘గుంగా పహిల్వాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భారత మానస పుత్రిక, నా సోదరి సాక్షి మలిక్ కోసం నేను నా ‘పద్మ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తా. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ... సాక్షిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను. దేశంలోని దిగ్గజ క్రీడాకారులంతా దీనిపై స్పందించాలని నేను కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీరేందర్ ట్వీట్ చేశాడు. స్పందించేందుకు నిరాకరించిన అనురాగ్ ఠాకూర్ మరోవైపు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు, తదుపరి స్టార్ రెజ్లర్ల నిరసన నిర్ణయాలపై స్పందించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లను అభినందించే కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘దీనిపై నేను ఇదివరకే చెప్పాల్సింది చెప్పా. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఠాకూర్ అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఎన్నికకు నిరసనగా కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. అంతేగాక డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ గెలవడం తమపై ప్రభావం చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలకగా.. మరో ఒలింపియన్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది? -
సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్‌పాత్‌పై కూర్చొని నిరసన తెలిపాడు. माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG — Virender Singh (@GoongaPahalwan) November 10, 2021 ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్‌కు వినబడదు, మాట్లాడలేడు. చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
మాజీ సీఎం సలహాదారుపై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా సలహాదారు ప్రొఫెషర్ వీరేంద్ర సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. జాట్ల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని, హింస పెరిగేలా రెచ్చగొట్టాలంటూ ఇటీవల జాట్ ఉద్యమ నాయకుడితో వీరేంద్ర సింగ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు వెలుగు చూశాయి. అయితే ఫోన్ సంభాషణల్లో ఉన్నది తన గొంతేనని, తన మాటలను కత్తిరించి వేరే అర్థం వచ్చేలా రికార్డ్ చేశారని వీరేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హింస వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరేంద్ర సింగ్ ఫోన్ సంభాషణలు బయటికి రావడం కలకలం రేపింది. హరియాణా పోలీసులు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాల్సి వుంది. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర సింగ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
అక్రమాస్తుల కేసులో మాజీ ప్రభుత్వ అధికారికి జైలు
న్యూఢిల్లీ: ఉద్యోగంలో ఉండగా రూ.24.88 లక్షల అక్రమాస్తులను సంపాదించిన ఓ ప్రభుత్వ మాజీ అధికారికి స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో 1965 నుంచి 2001 మధ్య కాలంలో ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేసిన వీరేందర్ సింగ్‌కి ప్రత్యేక సీబీఐ జడ్జి సంజీవ్ జైన్ రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. తన ఉద్యోగ కాలంలో రూ.31.14 లక్షల అక్రమాస్తులు సంపాదించినట్టు సీబీఐ కోర్టుకి వివరించింది. -
వీరేందర్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో రెజ్లింగ్ భారత్‌ను మరోసారి ఆదుకుంది. గత శనివారం బల్గేరియాలోని సోఫియాలో ముగిసిన డెఫిలింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) క్రీడల్లో భారత్‌కు లభించిన ఏకైక పతకం రెజ్లింగ్ నుంచి వచ్చింది. పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వీరేందర్ సింగ్ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో అతను టర్కీకి చెందిన ఒగుజ్ డొండెర్‌ను ఓడించాడు. లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లతో కలిసి ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో వీరేందర్ సాధన చేస్తుంటాడు. ఈ ప్రత్యేక ఒలింపిక్స్‌లో 28 ఏళ్ల వీరేందర్ పతకం నెగ్గడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2005 మెల్బోర్న్ డెఫిలింపిక్స్‌లో వీరేందర్ స్వర్ణం సాధించగా... 2009 చైనీస్ తైపీ డెఫిలింపిక్స్‌లో కాంస్యం నెగ్గాడు. హర్యానా పవర్ కార్పొరేషనల్లో గుమాస్తాగా పని చేస్తున్న వీరేందర్ 2008 ప్రపంచ బధిరుల చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు.