సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం(నవంబర్ 11) ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో అమృత్ టెండర్లలో స్కామ్ జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్‌రెడ్డికి చెందిన శోద కంపెనీకి రూ.1100 కోట్ల రూపాయల టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టారని ఫిర్యాదులో తెలిపారు. రూ.2 కోట్ల లాభం కూడా లేని కంపెనీకి ఇంత పెద్ద టెండర్ ఇవ్వడం వెనుక ఏదో గోల్‌మాల్ జరిగిందన్నారున. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. టెండర్లు రద్దు చేయాలన్నారు.
కాగా, గతంలో అమృత్ స్కామ్‌పై కేటీఆర్ మీడియా సమావేశాలు పెట్టి సీఎం రేవంత్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో బీజేపీ నేతలు కూడా రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్లు
Comments
Please login to add a commentAdd a comment