amruth
-
‘అమృత్’ స్కామ్.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం(నవంబర్ 11) ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో అమృత్ టెండర్లలో స్కామ్ జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్‌రెడ్డికి చెందిన శోద కంపెనీకి రూ.1100 కోట్ల రూపాయల టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టారని ఫిర్యాదులో తెలిపారు. రూ.2 కోట్ల లాభం కూడా లేని కంపెనీకి ఇంత పెద్ద టెండర్ ఇవ్వడం వెనుక ఏదో గోల్మాల్ జరిగిందన్నారున. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. టెండర్లు రద్దు చేయాలన్నారు.కాగా, గతంలో అమృత్ స్కామ్‌పై కేటీఆర్ మీడియా సమావేశాలు పెట్టి సీఎం రేవంత్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో బీజేపీ నేతలు కూడా రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్లు -
అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబం భారీ అవినీతి
-
అమృత్ 2.0.. ఇంకెప్పుడో?
ఆదిలాబాద్: స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద రూ. 95.50 కోట్ల నిధులు విడుదల చేసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన పనులను చేపట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి కూడా ఇచ్చింది. ఈ పనుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నిధులు సైతం మంజూరయ్యాయి. అయినా పనుల ప్రారంభంపై అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.14 నెలల క్రితం నిధుల మంజూరు..రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రజలకు అవసరమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద 2023 మే 20న నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.95.50 కోట్లు కేటాయిస్తూ జీవో నంబర్ 312ను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు బల్దియా కూడా తమ వాటా చెల్లించి తాగునీటి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు జారీ చేసింది.అప్పుడే పనులు ప్రారంభించాల్సి ఉండగా టెండర్ల దాఖలకు కాంట్రాక్టర్లు ఆ సమయంలో ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. గతేడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు ఈ పనులను నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి చేపట్టేందుకు అనుమతినిచ్చింది. పనులు ప్రారంభమవుతాయని ప్రజలు సంబరపడ్డారు. అయితే ఇప్పటికి ఎలాంటి ప్రగతి లేకపోవడం గమనార్హం.టెండర్ల ప్రక్రియ పూర్తయినా..పట్టణంలోని ప్రతీ వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించాలనే ఉద్దేశంతో పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తాగునీటి సమస్య ఉన్న పట్టణంలో కొత్తగా విలీనమైన కేఆర్కే కాలనీ, భగత్‌సింగ్‌నగర్, న్యూ హౌసింగ్‌బోర్డు, రాంపూర్ వంటి కాలనీల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలతో పాటు తాగునీటి సరఫరాకు అవసరమైన పైపులైన్లు, నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఏయే కాలనీల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రస్థాయిలోనే టెండర్ల ప్రక్రియ ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వేసవిలోనూ ఆయా ఆయా కాలనీల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.త్వరలోనే ప్రారంభిస్తాం..అమృత్ 2.0 పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా పనులకు భూమి పూజ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది, పదిహేను రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – గంగాధర్, పబ్లిక్ హెల్త్, ఈఈ -
అమృత్‌తో మదనపల్లెకు మహర్దశ
మదనపల్లె: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ పథకం ద్వారా మదనపల్లెకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ తెలిపారు. వారు శనివారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని 35 వార్డులలోనూ వార్డుబాట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని తెలిపారు. అనంతరం వాటి పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకుంటామని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నామన్నారు. పట్టణంలోని సీటీఎం రోడ్డు ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. మేదర్లతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్తిప్పారెడ్డితోపాటు చర్చించామని, వారికి ఇతర ప్రాంతాల్లో నివాస గృహాలు ఏర్పాటుచేయాలని, వ్యాపారానికి రైతు బజార్‌ను కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు రాధా, ఝాన్సీ, కమిషనర్ విశ్వనాథ్, మహిళా నాయకురాలు భార్గవి, లత, సరోజమ్మ పాల్గొన్నారు. -
‘అమృత్’ పనులపై స్థల పరిశీలన
చిత్తూరు (అర్బన్): ‘అమృత్’ పథకంలో భాగంగా చేపట్టనున్న పనుల కోసం ఎంపిక చేసిన స్థలాలను అధికారులు సోమవారం పరిశీలించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు భాస్కరరావుతో పాటు టాటా కన్సల్టెన్సీ నిర్వాహకులు నగరంలోని ఓవర్ బ్రిడ్జి, కట్టమంచి చెరువు, ఇరువారం, నీవానది ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో నుంచి వచ్చే మురుగునీరు నీవానదిలో కలవకముందే శుద్ధి చేసి ఇతర అవసరాలను ఉపయోగించేలా ప్లాంట్‌ను పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ఎక్కడెక్కడ పెట్టాలనే అంశంపై స్థలాలను అధికారులు పరిశీలించారు. -
అమృత్‌పై దాడి కేసులో పృథ్వీరాజ్ అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్‌లో అపార్ట్మెంట్ వాచ్మెన్ అమృత్‌పై దాడి కేసు విచారణ ముమ్మరం చేసినట్లు స్థానిక ఎస్ఐ సత్తయ్య శనివారం వెల్లడించారు. అందులోభాగంగా వికారాబాద్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కుమారుడు పృథ్వీరాజ్సహ ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్తయ్య తెలిపారు. -
నగరం ఇక స్మార్ట్!
- ‘అమృత్’లో బెజవాడకు స్థానం - నగరవాసుల్లో ‘స్మార్ట్’ ఆశలు - మంత్రి వెంకయ్యతో మేయర్ భేటీ - జిల్లాలో మచిలీపట్నం, గుడివాడకూ చోటు విజయవాడ సెంట్రల్ : షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఐనాక్స్ థియేటర్లతో భాసిల్లుతున్న బెజవాడ నగరం భవిష్యత్‌తో మరింత ఆకర్షణీయ (స్మార్ట్) హంగులను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి పథకం అటల్ అర్బన్ మోడ్రనైజేషన్ రెన్యువల్ స్కీం (అమృత్)లో నగరానికి చోటు దక్కడంతో అభివృద్ధి పరుగు పెడుతుందన్న ఆశలు రేకెత్తుతున్నాయి. దేశంలో 100 స్మార్ట్ సిటీలు, 500 అమృత నగరాలను తీర్చిదిద్దాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో గురువారం పట్టణ స్మార్ట్ సిటీ మిషన్, అటల్ అర్బన్ మోడ్రనైజేషన్ రెన్యువల్ స్కీం సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో నగర మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ పాల్గొన్నారు. శుక్రవారంతో ఈ వర్క్‌షాప్ పూర్తి కానుంది. సమష్టి కృషితో అభివృద్ధి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరపాలక సంస్థ సమష్టిగా కృషి చేస్తేనే విజయవాడ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఈ వర్క్‌షాప్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, గుడివాడ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే విజయవాడను అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాల్సిందిగా కోరారు. నగరంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను అందించారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు చేయూత నివ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంకయ్య మాట్లాడుతూ సమష్టి కృషితో అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీ అంటే... అన్నీ అనుకున్నట్లే జరిగి నిధుల వరద వస్తే నగర రూపురేఖలు మారిపోతాయనడంతో సందేహం లేదు. మెట్రో రైలు, సువిశాలమైన రోడ్లు, గ్రీన్ ఫీల్డ్, అత్యాధునిక టెక్నాలజీతో శానిటేషన్ అభివృద్ధి, 24 గంటలు విద్యుత్ సౌకర్యం, రోజంతా నగర ప్రజలకు అందుబాటులో శుద్ధమైన మంచినీరు, ఆధునిక హంగులతో కూడిన రైల్వేస్టేషన్, బస్టాండ్, విమానాశ్రయం, సిటీ మొత్తం వైఫై సౌకర్యం, గ్రీన్ ఫీల్డ్, డిస్నీల్యాండ్, కాలువల్లో బోటింగ్‌లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయి. జేఎన్ఎన్యూఆర్ఎం,‘రే’ కనుమరుగు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం), రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకాలు ఇకపై కనుమరుగు కానున్నాయి. 2007లో విజయవాడ నగరం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద ఎంపికైంది. రూ.1,422 కోట్లతో నగరాభివృద్ధి, గృహ నిర్మాణాలను ప్రారంభించారు. అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ గవర్నెన్స్ (యూఐజీ) కింద రోడ్లు, డ్రెయిన్లు, భూగర్భ డ్రెయినేజ్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్ల పనులు రూ.724 కోట్లతో చేపట్టారు. ఇందులో 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆనాడు చేసిన సర్వేలో లక్షా 4 వేల మందికి గృహాలు కావాలని తేలింది. తొలి విడతగా 28,152 గృహ నిర్మాణాలను చేపట్టాలని కార్పొరేషన్ నిర్ణయించింది. స్థలాల కొరత నేపథ్యంలో 18,176 గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 14,345 పూర్తి చేశారు. 3,841 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకం కింద ఎన్ఎస్సీ బోస్ నగర్లో 1,413, దాల్మిల్ ప్రాంతంలో 304 గృహ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి దాల్మిల్ ఏరియాలో శంకుస్థాపన కూడా చేశారు. నిధుల లేమి కారణంగా ఇంత వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చిన నేపథ్యంలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాల పేరు అమృత్‌గా మారనుంది. మచిలీపట్నం, గుడివాడకు మహర్దశ జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక సంఘాలకు మహర్దశ పట్టనుంది. నగరంతో పాటు జిల్లా నుంచి ఈ రెండు పట్టణాలు కూడా అమృత్ పథకంలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఇవి కూడా స్మార్ట్ పట్టణాలుగా అభివృద్ధి చెందనున్నాయి. బందరు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, కమిషనర్ మారుతీదివాకర్, గుడివాడ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ జి.ప్రదీప్‌కుమార్ కూడా ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. -
'గతం గుర్తుచేసుకుని బాధ పడాల్సినవసరం లేదు'
-
'గతం గుర్తుచేసుకుని బాధ పడాల్సినవసరం లేదు'
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. అమృత్, అందరికీ గృహాలు, స్మార్ట్ సిటీస్ మిషన్ పథకాలను న్యూఢిల్లీలో గురువారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. వీటిలో భాగంగా 100 ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని పథకాలు రూపొందిస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడగలమా అన్న సందేహం వద్దని ఆయన పేర్కొన్నారు. ప్రణాళికా బద్దంగా ముందడుగు వేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నగరాలు ఎలా అభివృద్ధి చెందాలన్నదానిపై చర్చిద్దామని, గతాన్ని గుర్తుచేసుకుని బాధపడాల్సిన అవసరంలేదన్నారు. పేదోళ్లకు ఇళ్లు కట్టించడమే కాదు, ఆత్మవిశ్వాసంతో బతికేలా చేద్దామని ప్రధాని మోదీ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 5 ఆకర్షణీయ నగరాలు, అమృత్ పట్టణాల ఆధునికీకరణను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఆకర్షణీయ నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన ఒక్కో నగరానికి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.