అమృత్‌తో మదనపల్లెకు మహర్దశ | amruthto madanapalle development | Sakshi
Sakshi News home page

అమృత్‌తో మదనపల్లెకు మహర్దశ

Oct 8 2016 5:14 PM | Updated on Aug 20 2018 9:16 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్‌ పథకం ద్వారా మదనపల్లెకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కొడవలి శివప్రసాద్‌ తెలిపారు.

మదనపల్లె: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్‌ పథకం ద్వారా మదనపల్లెకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కొడవలి శివప్రసాద్‌ తెలిపారు. వారు శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని 35 వార్డులలోనూ వార్డుబాట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని తెలిపారు. అనంతరం వాటి పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకుంటామని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నామన్నారు. పట్టణంలోని సీటీఎం రోడ్డు ట్రాఫిక్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. మేదర్లతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డితోపాటు చర్చించామని, వారికి ఇతర ప్రాంతాల్లో నివాస గృహాలు ఏర్పాటుచేయాలని, వ్యాపారానికి రైతు బజార్‌ను కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు రాధా, ఝాన్సీ, కమిషనర్‌ విశ్వనాథ్, మహిళా నాయకురాలు భార్గవి, లత, సరోజమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement