హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్లో అపార్ట్మెంట్ వాచ్మెన్ అమృత్పై దాడి కేసు విచారణ ముమ్మరం చేసినట్లు స్థానిక ఎస్ఐ సత్తయ్య శనివారం వెల్లడించారు. అందులోభాగంగా వికారాబాద్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కుమారుడు పృథ్వీరాజ్సహ ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్తయ్య తెలిపారు.