
కట్టమంచి చెరువు వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్న కార్పొరేషన్ అధికారులు
చిత్తూరు (అర్బన్): ‘అమృత్’ పథకంలో భాగంగా చేపట్టనున్న పనుల కోసం ఎంపిక చేసిన స్థలాలను అధికారులు సోమవారం పరిశీలించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు భాస్కరరావుతో పాటు టాటా కన్సల్టెన్సీ నిర్వాహకులు నగరంలోని ఓవర్ బ్రిడ్జి, కట్టమంచి చెరువు, ఇరువారం, నీవానది ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో నుంచి వచ్చే మురుగునీరు నీవానదిలో కలవకముందే శుద్ధి చేసి ఇతర అవసరాలను ఉపయోగించేలా ప్లాంట్‌ను పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ఎక్కడెక్కడ పెట్టాలనే అంశంపై స్థలాలను అధికారులు పరిశీలించారు.