కరాచీ: ప్రదర్శన మెరుగయ్యేందుకు నిషేధిత ఉ్రత్పేరకాలు ఉపయోగించిన పాకిస్తాన్ రెజ్లర్ అలీ అసద్‌పై ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2022 బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అలీ అసద్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక బౌట్‌లో అలీ అసద్ 11–0తో సూరజ్ సింగ్ (న్యూజిలాండ్)పై గెలుపొందాడు.
అయితే, 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అలీ అసద్ నిషేధిత ఉ్రత్పేరకాలు వాడినట్లు తేలింది. దాంతో 2022 నవంబర్‌లో అలీ అసద్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. అలీ అసద్ నెగ్గిన కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకొని నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ రెజ్లర్ సూరజ్ సింగ్‌కు ఈ పతకాన్ని అందించారు.
ఈ కేసును రెండేళ్లపాటు విచారించిన ఐటీఏ అలీ అసద్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఈ వారంలో అతడిపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. విచారణ సమయంలో అలీ అసద్ గైర్హాజరు కావడంతో ఐటీఏ తుది నిర్ణయాన్ని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment