Padma Shri awardee
-
వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత
యశవంతపుర: కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్ల పోషణకు అంకితం చేసిన తులసిగౌడ (90) కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నళ్లికి చెందిన తుళసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను పర్మినెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్నా, రిటైరైనా మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాలలో రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30 వేల మొక్కలను నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసిగౌడ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకటంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపారు. ప్రధాని మోదీ సంతాపం పర్యావరణవాది, పద్మశ్రీ తులసిగౌడ మరణం తీవ్ర విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం తెలిపారు. మొక్కల సంరక్షణకే తులసిగౌడ జీవితాన్ని ధారపోశారని, భూమిని రక్షించడానికి యువతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
పద్మశ్రీ మొగులయ్య దీనస్థితిపై కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్మనం మొగులయ్య రోజువారీ కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Heart Breaking: Padma Shri Awardee Mogulaiah Now a Daily Wager.He says his monthly honorarium stopped, and although all respond positively, they do nothing.Mogulaiah was seen working at a construction site in Turkayamanjal near Hyderabad.Darshanam Mogulaiah was honoured… pic.twitter.com/Zru4If7h0x— Sudhakar Udumula (@sudhakarudumula) May 3, 2024 బీఆర్ఎస్ పాలనలో నెలకు 10,000 గౌరవ వేతనంతో జీవించారు మొగులయ్య. అయితే ప్రస్తుతం తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమీ చేయడం లేదని వాపోయారు. తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారని, తనతోపాటు కొడుకు మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 అవసరమవుతాయని చెప్పారు. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.'గత ప్రభుత్వం నాకు రూ. కోటి రూపాయలు గ్రాంట్‌గా ఉచ్చింది. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపయోగించాను. తుర్కయంజాల్‌లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేకు మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పిటికీ పెండింగ్‌లోనే ఉంది. ' అని అన్నారు.కేటీఆర్ స్పందనతాజాగా మొగులయ్య దీనపరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. మొగులయ్య కుంటుంబాన్ని తను వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. తన టీం సభ్యులు వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. Thanks Sucheta Ji for bringing this news to my attention I will personally take care of Sri Moguliah’s family. My team @KTRoffice will reach out to him immediately https://t.co/xV4NjXtik6— KTR (@KTRBRS) May 3, 2024 -
ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ వసతి గృహాలను ఖాళీ చేయాల్సిందిగా కళాకారులను కేంద్రం కోరింది. అందులో భాగంగా బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సీ డ్యాన్సర్ గురు మాయాధర్ రౌత్(90)ను అధికారులు వసతి గృహం నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆయన నిరాశ్రయులయ్యారు. వివరాల ప్రకారం.. దశాబ్దాల క్రితం ప్రముఖ కళాకారుల కోసం కేంద్రం ఢిల్లీలో వసతి గృహాలను అందించింది. కాగా, వసతి గృహాల్లో వారు ఉండటాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వారు ఇళ్లను ఖాళీ చేయాలని 2020లో నోటీసు జారీ చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఎనిమిది కళాకారులు బంగ్లాలను ఏప్రిల్ 25వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించుకుంటే చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో వారు ఖాళీ చేయకపోవడంతో గురు మాయాధర్ రౌత్‌ను వసతి గృహం నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా గురు మాయాధర్ రౌత్ కూతురు మధుమితా రౌత్ మాట్లాడుతూ.. ఆ ఇంటిని తన తండ్రికి 25 ఏళ్ల క్రితం కేటాయించారని చెప్పింది. బలవంతంగా తమను బంగ్లా నుంచి బయటకు పంపిచేశారని ఆరోపించింది. పోలీసులు తమ వస్తువులను బయటకు విసిరేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘28 మంది కళాకారులలో దాదాపు ఎనిమిది మందికి అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వ వసతి గృహాల నుండి బయటకు వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు ఇచ్చాము.’’ అని అన్నారు. -
సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్‌పాత్‌పై కూర్చొని నిరసన తెలిపాడు. माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG — Virender Singh (@GoongaPahalwan) November 10, 2021 ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్‌కు వినబడదు, మాట్లాడలేడు. చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
‘మల్లేశం’ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో
-
మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది
‘‘ఇంగ్లీష్‌లో నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అనే సామెత ఉంది. కానీ ఈ సినిమాలో ‘మదర్ ఈజ్ నెసెసిటీ ఆఫ్ ఇన్వెన్షన్’ అని చూపించారు. ఎందుకంటే మల్లేశం గారు తన తల్లి కష్టాన్ని చూసి, తన తల్లి సమస్యతో పాటు ఎంతోమంది తల్లుల సమస్యలను తొలగించారు. ఎంతో మంది యంగ్ ఇన్నోవేటర్స్‌కు ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు’’ అన్నారు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. రాజ్ దర్శకత్వంలో శ్రీ అధికారి, రాజ్. ఆర్ నిర్మించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించిన ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శనివారం పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు కోసం ప్రదర్శించారు. సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ– ‘‘సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులెన్నో, సమాజంలో అజ్ఞాత సూర్యులెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో అనే ఓ కవిత సినిమాలోని ఎమోషన్ని రెండు గంటలపాటు క్యారీ చేసింది. మనం వెళ్లే దారిలో దారులన్నీ మూసి ఉన్నా ఏదో దారి తెరుచుకుని ఉంటుందనే విషయాన్ని వివరించిందీ చిత్రం. చేనేత కార్మికుల నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ వారి కష్ట నష్టాలను ఈ సినిమాలో చూపించారు. ప్రియదర్శి అద్భుతంగా నటించారు. తెలంగాణ యాసను, భాషలోని మాధుర్యాన్ని రైటర్ అశోక్‌కుమార్ చక్కగా రాశారు. ఈ సినిమాకు ప్రభుత్వం నుండి సహకారం అందించాలని గౌరవ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగారితో, గౌరవ ముఖ్యమంత్రిగారితో మాట్లాడతాను. అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయినా, మరేదైనా నా వంతుగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తా. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలనే ధరించాలి. చేనేత కార్మిలకు అండగా నిలబడాలనే నినాదంతో యువత ముందుకు అడుగులు వెయ్యాలి’’ అన్నారు. డి. సురేశ్‌బాబు, బి. నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
టెక్సాస్ యూనివర్శిటీలో అశోక్‌కి కీలక పదవి
వాషింగ్టన్ : బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ ఆఫ్ ది యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో సభ్యునిగా అశోక్ మగోను టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బొట్ నియమించారు. ఈ మేరకు అబ్బొట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021, మే 22వ తేదీ వరకు అశోక్ సభ్యునిగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అశోక్ గ్రేటర్ డల్లాస్ ఇండో అమెరికన్ ఛాంబర్స్‌కు వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నారు. భారత ప్రభుత్వం నుంచి 2014లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అశోక్ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. -
పుల్లెల శ్రీరామచంద్రుడు కన్నుమూత
హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంస్కృతాచార్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు (88) బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్ను మూశారు. ఆయన 200కి పైగా సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర గ్రంథాలను రచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతిగా, సంస్కృత అకాడమీ సంచాలకుడిగా, సురభారతి కార్యదర్శిగా, సంస్కృత భాషా ప్రచారక్ సమితి కులపతిగా, సంస్కృత భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన తెలుగులోకి అనువదించిన ‘వాల్మీకి రామాయణం’ ప్రతి తెలుగువారి ఇంటా కనిపిస్తుంది. సంస్కృతానికే మారుపేరుగా నిలిచిన రామచంద్రుడు మృతి సంస్కృతాభిమానులను శోకసంద్రంలో ముంచివేసింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజమండ్రి సమీపంలోని కోనసీమలోని ఐనవెల్లి గ్రామంలో జన్మించిన రామచంద్రుడుఆరు దశాబ్దాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం పుల్లెల శ్రీరామచంద్రుడు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అనువదించటంతో పాటు.. తెలుగు, సంస్కృతంలో ఆయన రచనలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. పుల్లెల సంస్కృత అకాడమీలో దశాబ్దానికి పైగా సేవలు అందించటంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృత విభాగం అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. కాగా, పుల్లెల శ్రీరామచంద్రుడు మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.