టెక్సాస్ యూనివర్శిటీలో అశోక్కి కీలక పదవి | Indian-American appointed to key university position in Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్ యూనివర్శిటీలో అశోక్కి కీలక పదవి

Published Tue, Nov 10 2015 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

Indian-American appointed to key university position in Texas

వాషింగ్టన్ : బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ ఆఫ్ ది యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో సభ్యునిగా అశోక్ మగోను టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బొట్ నియమించారు. ఈ మేరకు అబ్బొట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021, మే 22వ తేదీ వరకు అశోక్ సభ్యునిగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అశోక్ గ్రేటర్ డల్లాస్ ఇండో అమెరికన్ ఛాంబర్స్కు వ్యవస్థాపక ఛైర్మన్గా ఉన్నారు. భారత ప్రభుత్వం నుంచి 2014లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అశోక్ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత డల్లాస్లోని టెక్సాస్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement