ఇండో–అమెరికన్ పారిశ్రామిక వేత్తను ఎంపిక చేసిన ట్రంప్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త, మస్క్ సహాయకుడు శ్రీరామ్ కృష్ణన్ వైట్‌హౌస్ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామ్ కృష్ణన్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధ విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు.
కృత్రిమ మేధ విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్ కృష్ణన్ సహాయపడతారని, డేవిడ్ సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై కృష్ణన్ స్పందించారు. ‘మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచి్చనందుకు డోనాల్డ్ ట్రంప్‌కు దన్యవాదాలు’అని ట్వీట్ చేశారు.
తమిళనాడు నుంచి...
శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం వల్లియమ్మై ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్‌లలో పనిచేశారు. ఇటీవలే ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16 జెడ్)లో సాధారణ భాగస్వామిగా చేరారు. ఫేస్‌బుక్‌లో మొబైల్ యాప్ అడ్వర్టైజింగ్ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎలన్‌మస్క్ ట్విట్టర్‌ను (ఇప్పుడు ఎక్స్)ను స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకంగా పనిచేసిన కృష్ణన్ ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ తరువాత ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16జెడ్)లో సాధారణ భాగస్వామి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment