Sriram Krishnan
-
అమెరికా ఏఐ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త, మస్క్ సహాయకుడు శ్రీరామ్ కృష్ణన్ వైట్‌హౌస్ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామ్ కృష్ణన్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధ విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కృత్రిమ మేధ విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్ కృష్ణన్ సహాయపడతారని, డేవిడ్ సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై కృష్ణన్ స్పందించారు. ‘మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచి్చనందుకు డోనాల్డ్ ట్రంప్‌కు దన్యవాదాలు’అని ట్వీట్ చేశారు. తమిళనాడు నుంచి... శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడులోని ఎస్ఆర్ఎం వల్లియమ్మై ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్లలో పనిచేశారు. ఇటీవలే ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16 జెడ్)లో సాధారణ భాగస్వామిగా చేరారు. ఫేస్బుక్లో మొబైల్ యాప్ అడ్వర్టైజింగ్ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎలన్‌మస్క్ ట్విట్టర్‌ను (ఇప్పుడు ఎక్స్)ను స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకంగా పనిచేసిన కృష్ణన్ ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ తరువాత ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16జెడ్)లో సాధారణ భాగస్వామి అయ్యారు. -
ట్రంప్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా 'శ్రీరామ్ కృష్ణన్'ను నియమించారు. గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్‌లో పనిచేసిన కృష్ణన్.. ఇక వైట్ హౌస్ ఏఐ & క్రిప్టో జార్‌గా ఉండే 'డేవిడ్ సాక్స్'తో కలిసి పని చేయనున్నారు.''దేశానికి సేవ చేయడం, ఏఐలో అమెరికా నాయకత్వానికి సన్నిహితంగా పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు'' అంటూ.. శ్రీరామ్ కృష్ణన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.🇺🇸 I'm honored to be able to serve our country and ensure continued American leadership in AI working closely with @DavidSacks. Thank you @realDonaldTrump for this opportunity. pic.twitter.com/kw1n0IKK2a— Sriram Krishnan (@sriramk) December 22, 2024''శ్రీరామ్ కృష్ణన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమించినందుకు సంతోషిస్తున్నాము" అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.I am pleased to announce the brilliant Team that will be working in conjunction with our White House A.I. & Crypto Czar, David O. Sacks. Together, we will unleash scientific breakthroughs, ensure America's technological dominance, and usher in a Golden Age of American Innovation!…— Trump Posts on 𝕏 (@trump_repost) December 22, 2024ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?చెన్నైలో పుట్టిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు.విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. తరువాత మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్ వంటి వాటిలో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. కాగా ఇప్పుడు ఈయన వైట్ హౌస్‌లో పనిచేయనున్నారు. -
ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్ 8) యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం. 25ఏళ్లు.. నిజానికి ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్‌కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ వివరించారు. -
మస్క్, జుకర్‌బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత..
చెన్నైలో పుట్టి అమెరికాలోని అగ్ర కంపెనీలలో పనిచేసిన 'శ్రీరామ్ కృష్ణన్' ఇటీవల యూఏఈలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఫేస్బుక్ సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్', మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల', ఎక్స్ (ట్విటర్) అధినేత 'ఇలాన్ మస్క్'తో సహా టాప్ సిఇఓలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. యుక్త వయసులోనే కోడింగ్ నేర్చుకున్నట్లు, అదే తనను టెక్నాలజీ వైపు అడుగులు వేసేలా చేసిందని శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు. 2007లో మైక్రోసాఫ్ట్‌లో చేరి కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశారు, అప్పటికే సత్య నాదెళ్ల సీఈఓ కాలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన తరువాత ఫేస్బుక్లో చేరి 'మార్క్ జుకర్‌బర్గ్'తో కూడా కలిసి పనిచేశారు. ఇలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసిన సమయంలో శ్రీరామ్ అక్కడే పనిచేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాన్ మస్క్, జుకర్‌బర్గ్‌లు చిన్న చిన్న విషయాలను సైతం వారే చూసుకుంటారని, ఇతరులకు అప్పగించరని చెబుతూ.. మెటా సీఈఓ ప్రతి అంశం మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఒక ప్రాజెక్టు తీసుకున్న తరువాత అందులో పనిచేసే ఉద్యోగుల కంటే ఆయనే ఎక్కువ తెలుసుకుంటారని శ్రీరామ్ చెప్పారు. నా భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం మెటాలో పనిచేసింది, జుకర్‌బర్గ్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నారని ఆమె నాకు చెప్పిందని అన్నారు. ఇలాన్ మస్క్ విషయానికి వస్తే.. అందరూ అనుకున్నట్లు ఎక్కువ సమయంలో ఎక్స్(ట్విటర్)లో పోస్టులు చేయడానికి సమయం కేటాయించరని, ఆయనతో నేను ఉన్నప్పుడు 95 శాతం మీటింగులు జూనియర్ ఇంజనీర్లతో జరిగాయని తెలిపారు. ఆయన ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారని అన్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు! -
బ్లూ టిక్‌పై డబ్బులు..సమర్ధించిన మస్క్ సలహాదారుడు శ్రీరామ్ కృష్ణన్
ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్లూటిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని చేసిన ప్రకటనపై మండి పడుతున్నారు. అయినా విమర్శల్ని పట్టించుకోని మస్క్ ట్విటర్ బోట్ అభివృద్ధి, ట్రోల్స్‌ను అరికట్టేందుకు ఏకైక మార్గమని సమర్ధించుకున్నారు. తాజాగా ట్విటర్లో మస్క్ సలహాదారుడు, భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ సైతం సంస్థ చేస్తున్న మార్పులు సరైనవేనని అన్నారు. పెయిడ్ వెరిఫికేషన్‌పై యూజర్లు చేస్తున్న విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. బ్లూటిక్ వెరిఫికేషన్‌పై ట్విటర్ 8 డాలర్లు వసూలు చేయడాన్ని సమర్దిస్తూ.. అందుకు నాలుగు కారణాల్ని వెల్లడించారు. ఆ కారణాలు ఇలా ఉన్నాయి ► ప్రముఖుల పేర్లతో ఉపయోగించే పేరడీ అకౌంట్లను గుర్తించి వారి చర్యలు తీసుకోవచ్చు ► ట్విటర్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన యూజర్లు చాలా మంది ఉన్నారని, కాని ఇకపై అలాంటి వారిని వెరిఫై చేయమని చెప్పారు. ప్రముఖులు, సాధారణ యూజర్లు.. ఇలా స్థాయితో సంబంధం లేకుండా 8 డాలర్ల చెల్లించిన వారికి వెరిఫికేషన్ ఇస్తామని అన్నారు. ► ప్రస్తుతం ట్విటర్లో తీవ్రమైన స్పామ్ సమస్యలు ఉన్నాయని కృష్ణన్ చెప్పారు. విటాలిక్ ,ఎలన్ మస్క్‌లు బ్లూ టిక్ వెరిఫికేషన్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు గుర్తించారు. బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇవ్వడం వల్ల ఆ దాడుల సంఖ్యను తగ్గించవచ్చు. ► చివరగా, ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ అనేది ఏ యూజర్ ఎవరి గురించి ఏం చెప్పారు అనే అంశంపై స్పష్టత ఇస్తుంది. నకిలీ సమాచారాన్ని ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టే ట్విటర్ 8 డాలర్లు వసూలు చేస్తున్నట్లు కృష్ణన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. Several of the critiques of the $8 / verification are logically inconsistent. “verification solves for impersonation, this will cause more” 1. using a CC/mobile checkout dramatically increases friction. And everyone caught impersonating will lose their money. — Sriram Krishnan - sriramk.eth (@sriramk) November 6, 2022 2. there are lots of people who should be verified ( and often impersonated) and aren’t. And vice versa. The current path on any social network is opaque and easily gamed. $8 gives a consistent path for anyone regardless of their level of notability ( which is subjective). — Sriram Krishnan - sriramk.eth (@sriramk) November 6, 2022 చదవండి👉 ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
ట్విట్టర్‌కు శ్రీరామ్ రిపేర్లు
న్యూయార్క్: దిగ్గజ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను సంస్కరణల బాట పట్టిస్తానని ప్రతిజ్ఞ చేసిన దాని నూతన అధిపతి ఎలాన్ మస్క్ దృష్టి టెక్నాలజీ నిపుణుడు, చెన్నై వ్యక్తి శ్రీరామ్ కృష్ణన్‌పై పడింది. టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా విశేష అనుభవం ఉన్న శ్రీరామ్‌కు ట్విట్టర్లో కీలక మార్పులు చేర్పుల తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. చెన్నైలో జన్మించిన శ్రీరామ్ గతంలో అన్నా యూనివర్సిటీ పరిధిలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో 2001–05లో ఇంజనీరింగ్(ఐటీ) పూర్తిచేశారు. మైక్రోసాఫ్ట్‌లో వృత్తిజీవితం మొదలుపెట్టిన ఈయన 2017లో కొంతకాలం ట్విట్టర్లో పనిచేశారు. సెర్చ్, డిస్కవరీ, హోమ్ టైమ్‌లైన్, ఆన్ బోర్డింగ్/న్యూ యూజర్ ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ గ్రోత్ వంటి కోర్ ప్రొడక్ట్ విభాగాలకు నాయకత్వం వహించారు. రీ–డిజైన్ చేసిన ఈవెంట్ ఎక్స్పీరియన్స్ ఉత్పత్తులను స్వయంగా ప్రారంభించారు. స్నాప్, ఫేస్బుక్ వంటి సంస్థలకు మొబైల్ ప్రకటనల ఉత్పత్తుల అభివృద్ధిని పర్యవేక్షించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడుల (వెంచర్ క్యాపిటల్) సంస్థ అడ్రెసెన్ హోరోవిట్జ్(ఏ16జెడ్)లో ప్రస్తు తం భాగస్వామిగా ఉన్నారు. బిట్సీ, హోప్ఇన్, పాలీవర్క్ సంస్థలకూ సేవలందిస్తున్నారు. -
ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?
ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. దాదాపు రూ.3.3 లక్షల కోట్లు వెచ్చించి తనకు ఏమాత్రం అనుభవం లేని సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. వరుస నిర్ణయాలతో ట్విటర్ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుండగా..అందుకు ఓ భారతీయుడు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత తన మొదటి రోజే ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్,లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ సహా మరికొంత మంది టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను తొలగించారు. ఆ తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ, ప్రస్తుతం ట్విటర్లో 280 పదాలు మించకుండా ట్వీట్ చేయాలి. ఇప్పుడు ఆ పదాల సంఖ్యను పెంచాలనుకోవడం’ వంటి నిర్ణయాలతో చర్చాంశనీయంగా మారారు. అయితే ట్విటర్లో మస్క్ నిర్ణయాలకు భారతీయుడైన శ్రీరామ్ కృష్ణన్ సాయం చేస్తున్నారు. స్వయంగా అతనే మస్క్‌కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. నేను మరి కొంతమంది గొప్ప వ్యక్తులు కలిసి ట్విటర్లో మస్క్‌కి సహాయం చేస్తున్నాం. నేను, టెక్ కంపెనీ (16z)లు చేసే పని లేదా నిర్ణయాలు ప్రపంచంపై, వాటిని నిర్విర్తించే ఎలాన్ మస్క్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపగలవని నమ్ముతున్నాను అని ట్వీట్లో పేర్కొన్నారు. శ్రీరామ్ కృష్ణన్ ఎవరు? చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు .ఆ తర్వాత డైరెక్ట్ రెస్పాన్స్ యాడ్స్ బిజినెస్, డిస్ప్లే అడ్వర్టైజింగ్లో అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన మెటా (ఫేస్బుక్), స్నాప్‌లలో ఆడియన్స్ నెట్‌వర్క్‌తో పాటు, వివిధ మొబైల్ యాడ్ ప్రొడక్ట్‌లను తయారు చేశారు. ఓ పైపు దిగ్గజ కంపెనీల్లో ప్రాజెక్ట్‌లు చేస్తూనే వెంచర్ క్యాప్టలిస్ట్‌గా ఎదిగారు. 2021 ప్రారంభంలో కృష్ణన్ భార్య ఆర్తి రామమూర్తి స్టార్టప్‌ల నుండి వెంచర్ క్యాపిటలిజం, క్రిప్టోకరెన్సీల వరకు అన్నీంటిపై చర్చలు జరిపేందుకు క్లబ్‌హౌస్ టాక్ షోను ప్రారంభించారు. ఆర్తి రామమూర్తి హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షోకి ఎలాన్ మస్క్ గెస్ట్‌గా అటెండ్ అవ్వడం, సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో ట్విటర్లో ఎలాన్ మస్క్ తీసుకునే ప్రతి నిర్ణయంపై భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ సలహాల్ని, సూచనల్ని అందిస్తున్నారు. చదవండి👉 భారత్‌పై ఎలాన్ మస్క్ స్వీట్ రివెంజ్!