చెన్నైలో పుట్టి అమెరికాలోని అగ్ర కంపెనీలలో పనిచేసిన 'శ్రీరామ్ కృష్ణన్' ఇటీవల యూఏఈలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఫేస్‌బుక్ సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్', మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల', ఎక్స్ (ట్విటర్) అధినేత 'ఇలాన్ మస్క్'తో సహా టాప్ సిఇఓలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు.
యుక్త వయసులోనే కోడింగ్ నేర్చుకున్నట్లు, అదే తనను టెక్నాలజీ వైపు అడుగులు వేసేలా చేసిందని శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు. 2007లో మైక్రోసాఫ్ట్‌లో చేరి కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశారు, అప్పటికే సత్య నాదెళ్ల సీఈఓ కాలేదు.
మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన తరువాత ఫేస్‌బుక్‌లో చేరి 'మార్క్ జుకర్‌బర్గ్'తో కూడా కలిసి పనిచేశారు. ఇలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసిన సమయంలో శ్రీరామ్ అక్కడే పనిచేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇలాన్ మస్క్, జుకర్‌బర్గ్‌లు చిన్న చిన్న విషయాలను సైతం వారే చూసుకుంటారని, ఇతరులకు అప్పగించరని చెబుతూ.. మెటా సీఈఓ ప్రతి అంశం మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఒక ప్రాజెక్టు తీసుకున్న తరువాత అందులో పనిచేసే ఉద్యోగుల కంటే ఆయనే ఎక్కువ తెలుసుకుంటారని శ్రీరామ్ చెప్పారు. నా భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం మెటాలో పనిచేసింది, జుకర్‌బర్గ్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నారని ఆమె నాకు చెప్పిందని అన్నారు.
ఇలాన్ మస్క్ విషయానికి వస్తే.. అందరూ అనుకున్నట్లు ఎక్కువ సమయంలో ఎక్స్(ట్విటర్)లో పోస్టులు చేయడానికి సమయం కేటాయించరని, ఆయనతో నేను ఉన్నప్పుడు 95 శాతం మీటింగులు జూనియర్ ఇంజనీర్‌లతో జరిగాయని తెలిపారు. ఆయన ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారని అన్నారు.
చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు!
Comments
Please login to add a commentAdd a comment