ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. దాదాపు రూ.3.3 లక్షల కోట్లు వెచ్చించి తనకు ఏమాత్రం అనుభవం లేని సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. వరుస నిర్ణయాలతో ట్విటర్ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుండగా..అందుకు ఓ భారతీయుడు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత తన మొదటి రోజే ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్,లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ సహా మరికొంత మంది టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను తొలగించారు. ఆ తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ, ప్రస్తుతం ట్విటర్‌లో 280 పదాలు మించకుండా ట్వీట్ చేయాలి. ఇప్పుడు ఆ పదాల సంఖ్యను పెంచాలనుకోవడం’ వంటి నిర్ణయాలతో చర్చాంశనీయంగా మారారు.
అయితే ట్విటర్‌లో మస్క్ నిర్ణయాలకు భారతీయుడైన శ్రీరామ్ కృష్ణన్ సాయం చేస్తున్నారు. స్వయంగా అతనే మస్క్‌కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. నేను మరి కొంతమంది గొప్ప వ్యక్తులు కలిసి ట్విటర్‌లో మస్క్‌కి సహాయం చేస్తున్నాం. నేను, టెక్ కంపెనీ (16z)లు చేసే పని లేదా నిర్ణయాలు ప్రపంచంపై, వాటిని నిర్విర్తించే ఎలాన్ మస్క్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపగలవని నమ్ముతున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
శ్రీరామ్ కృష్ణన్ ఎవరు?
చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు .ఆ తర్వాత డైరెక్ట్ రెస్పాన్స్ యాడ్స్ బిజినెస్, డిస్‌ప్లే అడ్వర్టైజింగ్‌లో అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన మెటా (ఫేస్‌బుక్), స్నాప్‌లలో ఆడియన్స్ నెట్‌వర్క్‌తో పాటు, వివిధ మొబైల్ యాడ్ ప్రొడక్ట్‌లను తయారు చేశారు. ఓ పైపు దిగ్గజ కంపెనీల్లో ప్రాజెక్ట్‌లు చేస్తూనే వెంచర్ క్యాప్టలిస్ట్‌గా ఎదిగారు.
2021 ప్రారంభంలో కృష్ణన్ భార్య ఆర్తి రామమూర్తి స్టార్టప్‌ల నుండి వెంచర్ క్యాపిటలిజం, క్రిప్టోకరెన్సీల వరకు అన్నీంటిపై చర్చలు జరిపేందుకు క్లబ్‌హౌస్ టాక్ షోను ప్రారంభించారు. ఆర్తి రామమూర్తి హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షోకి ఎలాన్ మస్క్ గెస్ట్‌గా అటెండ్ అవ్వడం, సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో ట్విటర్‌లో ఎలాన్ మస్క్ తీసుకునే ప్రతి నిర్ణయంపై భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ సలహాల్ని, సూచనల్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment