Senior Advisor
-
అమెరికా ఏఐ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త, మస్క్ సహాయకుడు శ్రీరామ్ కృష్ణన్ వైట్‌హౌస్ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామ్ కృష్ణన్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధ విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కృత్రిమ మేధ విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్ కృష్ణన్ సహాయపడతారని, డేవిడ్ సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై కృష్ణన్ స్పందించారు. ‘మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచి్చనందుకు డోనాల్డ్ ట్రంప్‌కు దన్యవాదాలు’అని ట్వీట్ చేశారు. తమిళనాడు నుంచి... శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడులోని ఎస్ఆర్ఎం వల్లియమ్మై ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్లలో పనిచేశారు. ఇటీవలే ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16 జెడ్)లో సాధారణ భాగస్వామిగా చేరారు. ఫేస్బుక్లో మొబైల్ యాప్ అడ్వర్టైజింగ్ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎలన్‌మస్క్ ట్విట్టర్‌ను (ఇప్పుడు ఎక్స్)ను స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకంగా పనిచేసిన కృష్ణన్ ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ తరువాత ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16జెడ్)లో సాధారణ భాగస్వామి అయ్యారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ సీఈవోకు డెలాయిట్‌లో కీలక పదవి
ప్రముఖ బ్యాంకర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పూరి (Aditya Puri)కి ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ డెలాయిట్ (Deloitte) కీలక పదవి ఇచ్చింది. కంపెనీ సీనియర్ సలహాదారుగా నియమించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి బిజినెస్ లీడర్లలో ఒకరిగా పేరుపొందిన ఆదిత్య పూరి 1994లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థలో 26 సంవత్సరాలపాలు సేవలందించారు. 2020లో పదవీ విరమణ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయిన డెలాయిట్‌లో చేరినందుకు సంతోషిస్తున్నానని ఆదిత్య పూరి పేర్కొన్నారు. విశేష అనుభవం, దూరదృష్టి గల ఆదిత్యపూరి నియామకంపై డెలాయిట్ సౌత్ ఏషియా సీఈఓ రోమల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు జూన్‌లో భారతి ఎయిర్టెల్, సాఫ్ట్‌బ్యాంక్ ఇండియా మాజీ సీఈవో మనోజ్ కోహ్లీని సీనియర్ సలహాదారుగా డెలాయిట్ నియమించుకుంది. -
సీఎం జగన్ గొప్ప చొరవ తీసుకున్నారు: నీలం పటేల్
-
బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా
వాషింగ్టన్: భారతీయ–అమెరికన్, విధాన నిపుణురాలు నీరా టాండన్(50)కు అగ్రరాజ్యం అమెరికాలో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడు బైడెన్‌కు ఆమె సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. నీరా రెండు నెలల క్రితమే డైరెక్టర్ ఆఫ్ ద వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) పదవికి నామినేట్ అయ్యారు. అయితే ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు వ్యతిరేకించడంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ బైడెన్ తన ప్రభుత్వంలో ఆమె సేవలు అవసరమని భావించారు. దాంతో మరో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా నీరా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. యూఎస్ డిజిటల్ సర్వీసు, కేర్ యాక్ట్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) పనిచేస్తున్నారు. సమాజాభివృద్ధి కోసం సంస్థ కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే నీరా టాండన్ గతంలో పలువురు రాజకీయ నాయకులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. యూఎస్ హెల్త్ డిపార్డ్మెంట్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సీనియర్ అడ్వైజర్‌గానూ సేవలందించారు. బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన అఫర్డబుల్ కేర్ యాక్ట్ విధివిధానాలను ఖరారు చేయడానికి అమెరికా పార్లమెంట్‌తో కలిసి పనిచేశారు. ఒబామా, బైడెన్ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు వారి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. -
ఐడీజీ వెంచర్స్ సలహాదారుగా రతన్ టాటా
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా టెక్నాలజీ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఐడీజీ వెంచర్స్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్‌గా చేరారు. వ్యాపార రంగంలో అపార అనుభవమున్న టాటా.. పోర్ట్‌ఫోలియో కంపెనీల వ్యాపారాభివృద్ధి అవకాశాలు, అంతర్జాతీయంగా విస్తరణ, టీమ్ బిల్డింగ్ తదితర అంశాల్లో తగు సలహాలు, సూచనలు ఇస్తారని ఐడీజీ వెంచర్స్ వ్యవస్థాపక చైర్మన్ సుధీర్ సేథి తెలిపారు. రతన్ టాటా ఇప్పటికే స్నాప్‌డీల్, అర్బన్ లాడర్, పేటీఎం తదితర డజను పైగా స్టార్టప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, ప్రారంభ స్థాయి టెక్నాలజీ స్టార్టప్‌లకు ఐడీజీ వెంచర్స్ తోడ్పాటు అందిస్తోంది. ఇప్పటిదాకా ఫ్లిప్‌కార్ట్, యాత్రా, లెన్స్‌కార్ట్ తదితర 50 పైగా కంపెనీల్లో రూ. 1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.