ఐడీజీ వెంచర్స్ సలహాదారుగా రతన్ టాటా | IDG Ventures as an advisor to Ratan Tata | Sakshi
Sakshi News home page

ఐడీజీ వెంచర్స్ సలహాదారుగా రతన్ టాటా

Published Thu, Sep 10 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

ఐడీజీ వెంచర్స్ సలహాదారుగా రతన్ టాటా

ఐడీజీ వెంచర్స్ సలహాదారుగా రతన్ టాటా

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా టెక్నాలజీ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఐడీజీ వెంచర్స్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్‌గా చేరారు. వ్యాపార రంగంలో అపార అనుభవమున్న టాటా.. పోర్ట్‌ఫోలియో కంపెనీల వ్యాపారాభివృద్ధి అవకాశాలు, అంతర్జాతీయంగా విస్తరణ, టీమ్ బిల్డింగ్ తదితర అంశాల్లో తగు సలహాలు, సూచనలు ఇస్తారని ఐడీజీ వెంచర్స్ వ్యవస్థాపక చైర్మన్ సుధీర్ సేథి తెలిపారు. రతన్ టాటా ఇప్పటికే స్నాప్‌డీల్, అర్బన్ లాడర్, పేటీఎం తదితర డజను పైగా స్టార్టప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు.  మరోవైపు, ప్రారంభ స్థాయి టెక్నాలజీ స్టార్టప్‌లకు ఐడీజీ వెంచర్స్ తోడ్పాటు అందిస్తోంది. ఇప్పటిదాకా ఫ్లిప్‌కార్ట్, యాత్రా, లెన్స్‌కార్ట్ తదితర 50 పైగా కంపెనీల్లో రూ. 1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement