White House adviser
-
డోజ్ నుంచి వైదొలగను: మస్క్
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారథ్యం నుంచి వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తలను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఖండించారు. ‘‘అవన్నీ పుకార్లే. పని పూర్తయ్యేదాకా పదవిలో కొనసాగుతా’’అని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. వైట్‌హౌస్ కూడా ఈ వార్తలను ఖండించింది. ‘‘అవన్నీ చెత్త వార్తల. పదవీకాలం పూర్తయ్యాకే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతారు. మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఈ మేరకు గతంలోనే బహిరంగంగా ప్రకటించారు’’అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. ట్రంప్ అంతర్గత వ్యవహారాల నుంచి మస్క్ పూర్తిగా తప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే అది వాళ్లను వాళ్లు మోసగించుకోవడమేనని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరన్నారు. డోజ్ నుంచి మస్క్ కొద్ది వారాల్లో తప్పుకుంటారని ట్రంప్ స్వయంగా కేబినెట్‌కు తెలిపినట్లు పొలిటికో నివేదిక పేర్కొనడం తెలిసిందే. ‘‘ఆయన త్వరలో సొంత వ్యాపారాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. అందుకు ట్రంప్ కూడా అంగీకరించారు. మస్క్ ఇక అనధికారిక సలహాదారు పాత్ర పోషిస్తారు’’అని చెప్పుకొచ్చింది. జనవరిలో డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్ ఫెడరల్ వ్యయాలను తగ్గింపు, ప్రభుత్వోద్యోగుల ఉద్వాసనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను సమూలంగా మెరుగు పరచడానికి ఈ చర్యలు అవసరమంటున్నారు. ఆయన నాయకత్వంలో డోజ్ ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టులు, శ్రామిక శక్తిలో భారీ కోతలు పెట్టింది. ఇవన్నీ అంతిమంగా ప్రభుత్వానికి లక్ష కోట్ల డాలర్ల దాకా ఆదా చేయగలవని పలు నివేదికలు అంచనా వేస్తునఆనయి. ప్రత్యేక ప్రభుత్వోద్యోగిగా మస్క్ పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుందని భావిస్తున్నారు. ఆలోగా ఫెడరల్ వ్యయాన్ని లక్ష కోట్ల డాలర్ల మేరకు తగ్గించే పనిని పూర్తి చేయగలనని ఆయన చెబుతున్నారు. -
అమెరికా ఏఐ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త, మస్క్ సహాయకుడు శ్రీరామ్ కృష్ణన్ వైట్‌హౌస్ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామ్ కృష్ణన్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధ విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కృత్రిమ మేధ విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్ కృష్ణన్ సహాయపడతారని, డేవిడ్ సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై కృష్ణన్ స్పందించారు. ‘మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచి్చనందుకు డోనాల్డ్ ట్రంప్‌కు దన్యవాదాలు’అని ట్వీట్ చేశారు. తమిళనాడు నుంచి... శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడులోని ఎస్ఆర్ఎం వల్లియమ్మై ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్లలో పనిచేశారు. ఇటీవలే ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16 జెడ్)లో సాధారణ భాగస్వామిగా చేరారు. ఫేస్బుక్లో మొబైల్ యాప్ అడ్వర్టైజింగ్ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎలన్‌మస్క్ ట్విట్టర్‌ను (ఇప్పుడు ఎక్స్)ను స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకంగా పనిచేసిన కృష్ణన్ ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ తరువాత ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16జెడ్)లో సాధారణ భాగస్వామి అయ్యారు. -
వైట్‌హౌస్‌కి కరోనా కాటు..
వాషింగ్టన్: వైట్‌హౌస్ వెన్నులో కరోనా వణుకు పుట్టిస్తోంది. రోజుకి కొన్ని కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి కరోనా సోకిన తర్వాత కొత్త కేసుల సంఖ్య మరింత ఎక్కువైంది. తాజాగా ట్రంప్ సీనియర్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లర్‌కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే 20 మందికి పైగా వైట్‌హౌస్ సిబ్బం ది, అధికారులు, జర్నలిస్టులకి కరోనా సోక డంతో మిగిలిన వారిలో ఆందోళన మొద లైంది. మొదట్నుంచీ వైట్‌హౌస్‌లో మా స్కు లు ధరించాలన్న నిబంధన లేకపోవ డం, కరోనాపై అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యపూరిత వైఖరే కొంపముంచిందన్న విశ్లేషణలు వినిపి స్తున్నాయి. మాస్కులు ధరించడం ద్వారా వైట్‌హౌస్‌లో కరోనా కేసుల్ని అరికట్టి ఉండ వచ్చునని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచీ అన్నారు. ‘‘ప్రతిరోజూ మరికొంత మంది కరోనా బారిన పడుతున్నారు. ఇది ఎంతో దురదృష్టకరం. కరోనాని అడ్డుకునే బలమైన ఆయుధం మాస్కు మన దగ్గర ఉంది. అది ధరించి ముందే నివారించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు’’అని ఫౌచీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారు ► డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ► మెలానియా, ట్రంప్ భార్య ► స్టీఫెన్ మిల్లర్, సీనియర్ సలహాదారు ► హోప్ హిక్స్, సీనియర్ సలహాదారు ► కేలే మెకానీ, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ ► జాలెన్ డ్రమండ్, అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ ► బిల్ స్టీఫెన్, ట్రంప్ ప్రచారకుడు ► చాద్ గిల్మార్టిన్, వైట్ హౌస్ ప్రెస్ స్టాఫర్ ► జైనా మెక్‌కారెన్, ట్రంప్ మిలటరీ అసిస్టెంట్ ► కరొలైన్ లెవిట్, వైట్‌హౌస్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ ► అడ్మిరల్ చార్లెస్ రే, తీరప్రాంత వైస్ కమాండెంట్ ► రోనా మెక్‌డేనియల్, ఆర్ఎన్సీ చైర్ ఉమెన్ ► మైక్ లీ, ఉటా సెనేటర్ ► థామ్ టిల్లీస్, నార్త్ కరోలినా సెనేటర్ ► కెల్యానె కాన్వే, మాజీ సీనియర్ సలహాదారు ► క్రిస్ క్రిస్టీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ ► మరో ఇద్దరు వైట్‌హౌస్ కీపింగ్ సిబ్బంది, ముగ్గురు పాత్రికేయులు కరోనా తగ్గకుండా బిగ్ డిబేట్ వద్దు: బైడెన్ వైట్‌హౌస్‌కి చేరుకున్న అ«ధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న ఉత్సాహంలో ఉన్నారు. ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆక్సిజన్ లెవల్స్ సాధారణ స్థితిలోనే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. దీంతో అక్టోబర్ 15న డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌తో జరగనున్న రెండో బిగ్ డిబేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్‌కి కరోనా పూర్తిగా తగ్గకుండా డిబేట్ నిర్వహించడం సరికాదని బైడెన్ అన్నారు. ఉద్దీపనలపై చర్చలొద్దు! కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు ప్రకటించదలిచిన ఉద్దీపనలపై డెమొక్రాట్స్‌తో చర్చలు నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. డెమొక్రాట్ నేత నాన్సీ పెలొస్కీ ఉద్దీపన చర్చల్లో సరిగా పాల్గొనడంలేదని విమర్శించారు. అందుకే ఉద్దీపనలపై చర్చలను ఆపమని ఆదేశించానని, తాను తిరిగి ఎన్నికయ్యాక ఒక బడా ప్యాకేజీని ప్రవేశపెడతానని ట్రంప్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందే ఒక ప్రధాన ప్యాకేజీని ఇచ్చేందుకు వైట్‌హౌస్ అధికారులు డెమొక్రాట్లతో చర్చిస్తున్నారు. సూపర్ స్ప్రెడర్ రోజ్ గార్డెన్ ! సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అమీ కోనే బారెట్‌ను నామినేట్ చేసే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 26న అధ్యక్షుడు ట్రంప్ రోజ్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా వ్యాపించి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఇతర సిబ్బంది 200 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఏ ఒక్కరూ మాస్కులు ధరించలేదు. భౌతిక దూరాన్ని కూడా పాటించలేదు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార ర్యాలీల్లో అధ్యక్షుడు విస్తృతంగా పాల్గొన్నారు. ఆయన వెంట వైట్ హౌస్ సిబ్బంది చాలా మంది ఉన్నారు. ఈ ర్యాలీల్లో కూడా ఎక్కడా కోవిడ్ నిబం« దనలు పాటించిన దాఖలాలు లేవు. దీంతో కరోనా విజృంభణ కొనసాగు తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. -
అల్లుడికి పెద్ద పదవి ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ సొంత అల్లుడు జారెద్ కుష్నర్కు కీలక పదవి కట్టబెట్టారు. తనకు సీనియర్ సలహారుదారుగా అల్లుడిని నియమించారు. వాణిజ్యం, మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో సలహాలు ఇచ్చే బాధ్యతను కుష్నర్కు అప్పగించారు. అమెరికా అధ్యక్షుడి బంధువులు కీలక పదవులను చేపట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. చట్టబద్దమైన ఆమోదం లభించిన వెంటనే 35 ఏళ్ల కుష్నర్ సలహాదారు పదవి చేపడతారు. ప్రభుత్వ పదవుల్లో ఆశ్రిత పక్షపాతాన్ని నిరోధిస్తూ 1967లో చేసిన చట్టాన్ని ఉల్లంఘించలేదని నిర్ధారణ అయిన తర్వాతే కుష్నర్ పదవి చేపట్టడానికి వీలవుతుంది. సలహాదారుకు జీతం చెల్లించరు కాబట్టి సెనేట్ ఆమోదం అవసరం లేదు. ‘కుష్నర్ తనకు లభించిన అద్భుత ఆస్తి.. ఎన్నికల ప్రచారం, అధికార బదిలీలో నమ్మకమైన సలహారుదారుగి నిలిచాడ’ని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంకాను పెళ్లాడిన కుష్నర్.. న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యవరించారు. తన భర్తకు కీలక పదవి దక్కడంతో తాను ఇంటికే పరిమితం కావాలని ఇవాంకా భావిస్తున్నారు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కు షిప్ట్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.