ఇల్లినాయిస్ : ఒక్కోసారి మనం చేసే చిన్న పొరపాట్ల వలన నవ్వులపాలు కావాల్సి వస్తుంది. అమెరికన్ మోడల్, నటుడు నైల్ డామార్కోకు ఇల్లినాయిస్ ఎయిర్‌పోర్టులో వింత అనుభవం ఎదురైంది. వినికిడి లోపం ఉన్న ఈ నటుడికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని భావించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది చేసిన పొరపాటు ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తోంది. నైల్‌కు ప్రత్యేకంగా సహాయం చేసేందుకు.. ఆయనకు బ్రెయిలీ లిపిలో ఉన్న సేఫ్టీ మాన్యువల్ అందించారు.
సరిగ్గా చెవులు వినపడని తనకు బ్రెయిలీలోని సెఫ్టీ మాన్యువల్ ఎలా ఉపయోగపడుతుందో అర్థంకాక ఆయన తల గోక్కున్నారు. ఇదే విషయాన్ని నైల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘వారు నాకు బ్రెయిలీ లిపిలో ఉన్న సేఫ్టీ మాన్యువల్ అందించారు. ఎందుకంటే నేను చెవిడివాడిని. ఇది పిచ్చితనమే కదా.. నేను వినలేను అంటే దాని అర్థం నాకు బ్రెయిలీతో అవసరం ఉందని కాదు’ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఇదివరకు ఎన్నోసార్లు తాను ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని, ఇది వారికి కొత్తేంకాదని తెలిపాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment