braille lipi
-
సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది.. రెస్టారెంట్లన్నీ..
రెస్టారెంట్లన్నీ సాధారణంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటిని ఇస్తుంది. మహా అయితే ప్రత్యేకంగా ఉండేందుకు మరింత హంగులు ఆర్భాటాలతో కస్టమర్లని ఆకర్షించే యత్నం చేస్తాయి అంత వరకే. కానీ దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరం ఉన్న కస్టమర్ల సంగతిని గుర్తించవు అనలా లేక పరిగణించరు అని చెప్పాలో తెలియదు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవాళ్ల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్లు రెస్టారెంట్‌కి వచ్చి.. మెను చూసి ఆర్డర్ ఇవ్వాలంటే మరొకరి సాయం తీసుకోవాల్సిందే. లేదా వారు ఫ్రెండ్స్నో, బంధువులనో తోడు తెచ్చుకోవాల్సిందే. ఇంతవరకు ఎవ్వరికీ.. వారు కూడా మెనుని చూసి ఆర్డర్ చేసుకుంటే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు. ఆ దిశగా అడుగులు వేయాలేదు . కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా అడుగులు వేసి ఆచరణలోకి తీసుకొచ్చి చూపింది. ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. ఇండోర్‌లోని గురుకృపా రెస్టారెంట్ దృష్టిలోపం ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు కూడా స్వయంగా మెను చూసి ఆర్డర్ చేసుకుని తిసేలా చేసింది ఆ రెస్టారెంట్. మహేష్ దృష్టిహీన్ కళ్యాణ సంఘ నుంచి కొంతమంది దృష్టిలోపం ఉన్న పిల్లలను రెస్టారెంట్‌కి ఆహ్వానించారు. బ్రెయిలీ లిపిలో చెక్కబడిన మెనూ కార్డ్ సాయంతో ఆ పిల్లలంతా తమ ఆర్డర్లను స్వయంగా వారే తెప్పించుకుని తిన్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతమంది రెస్టారెంట్ ఆపరేటర్లు కలిసిన తర్వాత ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియన్ గ్రూప్ చైర్పర్సన్ భావన గనేదివాల్ మాట్లాడుతూ..అన్ని రెస్టారెంట్లవారు ఇలా చేసేలా పురికొల్పేందుకు మహేష్ దృష్టిహీన్ కళ్యాణ్ సంఘ్ నుంచి దృష్టి లోపం ఉన్న పిల్లలను పిలిపించి ట్రయల్ వేశాం. అది నిజంగా సక్సెస్ అయ్యింది. వారికోసం ఈ బ్రెయిలీ లిపి మెను కార్డ్‌లను చండీగఢ్ నుంచి తెప్పించి. అలాంటి పది కార్డ్‌లను ఇతర రెస్టారెంట్లకు పంపుతాం. ఇక నుంచి రెస్టారెంట్లన్నీంటిలో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ మెనూ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలనుకుంటున్నాం. రెస్టారెంట్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు దృష్టిలోపం ఉన్న కస్టమర్లు ఇక ఇబ్బంది పడరు, పైగా ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. అని చెప్పుకొచ్చారు భావన గనేదివాల్. ఇక సదరు గురుకృపా రెస్టారెంట్ యజమాని సిమ్రాన్ భాటియా మాట్లాడుతూ.. యంగ్ ఇండియా గ్రూప్ మమ్మల్ని సంప్రదించి బ్రెయిలీ లిపిలో మెను కార్డ్‌లను తయారు చేయమని అడిగింది. ఇది మాకు కొత్తగా అనిపించినా.. నచ్చింది. ఇంతవరకు అలాంటి సౌకర్యం ఏ రెస్టారెంట్లలోనూ లేదు. పిల్లలంతా అలా బ్రెయిలీ లిపి మెను కార్డులను చూసి ఆర్డర్ చేసినప్పుడూ చాలా ఆనందంగా అనిపించిందన్నారు రెస్టారెంట్ యజమాని భాటియా. అలాగే దృష్టిలోపం పిల్లలు సైతం తాము మెను కార్డ్‌ని చదవి ఆర్డర్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. ఇది తమకి ఎవ్వరిపై ఆధారపడటం లేదన్న ఫీలింగ్‌ని ఇచ్చిందన్నారు. అందరికీ ఇలాంటి సౌకర్యం అందాలని కోరుకుంటున్నారు. ఏదీఏమైన ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్ అనుకున్నదే తడువుగా ఆచరించి చూపడం ఇంకా గ్రేట్ కదూ!. (చదవండి: వాట్! ఈజిప్టు మమ్మీ నుంచి పరిమిళాలు వెదజల్లే "సెంట్"! షాకింగ్ విషయాలు వెల్లండించిన శాస్త్రవేత్తలు!) -
మునివేళ్లపై భవిష్యత్తు
అంధురాలైన రేషమ్ తల్వార్ తన భవిష్యత్తు బాగుండాలంటే బ్రెయిలీ నేర్చుకోక తప్పదని తొమ్మిదేళ్ల వయసులోనే గ్రహించింది. బ్రెయిలీలోనే ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఇగ్నోలో పి.జి చేసింది. ఆ చదువు ఆమెకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేడు సక్సెస్ఫుల్ రేడియో జాకీగా ఆమెకు ఉపాధిని ఇస్తోంది. చెన్నైకి చెందిన అంధురాలు బెనో జెఫైన్ బ్రెయిలీలో దొరికే మెటిరియల్లో ఐ.ఏ.ఎస్‌కు ప్రిపేర్ అయ్యి ఐ.ఎఫ్.ఎస్ సాధించిన తొలి అంధ మహిళగా రికార్డు స్థాపించింది. స్త్రీలు అంధులైతే కుటుంబాలు వారిని ఇంట కూచోబెడతాయి. కాని బ్రెయిలీ అనే అలీబాబా దీనిన్ని రుద్ది వారు అద్భుత విజయాలు సాధిస్తూనే ఉన్నారు. చీకటి తమ వెలుతురుకు అడ్డు కాదంటున్నారు. మన దేశంలో కోటీ యాభై లక్షల మంది పాక్షిక/పూర్తి అంధులు ఉన్నారు. వారిలో 2 లక్షల మంది చిన్నారులు. భారత్ వంటి వెనుకబడిన దేశాలలో అంధుల శాతం ఎక్కువ. దీనికి కారణం గర్భధారణ సమయంలో సరైన పరీక్షలు చేయించకపోవడం, పుట్టిన వెంటనే కంటి సమస్యలను గుర్తించకపోవడం, జన్మించాక వచ్చే ఐ ఇన్ఫెక్షన్స్కు సరైన చికిత్స చేయించకపోవడం, పిల్లల్లో వచ్చే హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి వంటి సమస్యలకు కూడా అద్దాల వంటి సహాయక పరికరాలను ఉపయోగించకపోవడం. అంధులుగా జన్మించడం అంటే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొనడం. అబ్బాయిలు అంధులుగా పుడితే కుటుంబం ఏదో ఒక మేరకు వారికి తర్ఫీదు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాని అమ్మాయి అంధురాలైతే చాలామటుకు నిరుత్సాహమే ఎదురవుతుంది. అంధుల అక్షరాస్యత కళ్లున్న వాళ్లకు అక్షరాస్యత ఉన్నట్టే అంధులకు కూడా అక్షరాస్యత ఉంటుంది. మన దేశంలో అంధుల అక్షరాస్యత కేవలం ఒక శాతం. బ్రిటన్‌లో ఇది 4 శాతం ఉంది. అంధుల అక్షరాస్యత అంటే బ్రెయిలీని చదవడం రాయడం రావడమే. లూయిస్ బ్రెయిలీ అనే ఫ్రెంచ్ అంధ విద్యావేత్త రూపకల్పన చేసిన బ్రెయిలీ కోడ్ పుట్టి 200 ఏళ్లు అయినా 70 ఏళ్ల క్రితమే భారతీయ భాషల కోసం ఉమ్మడి ‘భారతీ బ్రెయిలీ’ని మనం తయారు చేసుకున్నా నేటికీ బ్రెయిలీ అంధ విద్యార్థులకు అందని ఫలంగానే ఉంది. సంప్రదాయ బ్లైండ్ స్కూళ్లు, కాలేజీలలో బ్రెయిలీ నేర్పిస్తున్నా సమ్మిళితంగా (ఇన్‌క్లూజివ్) మామూలు పిల్లలతో కలిసి చదువుకోవాలనుకునే పిల్లలకు బ్రెయిలీ అందడం లేదు. దీనికి కారణం తగినంత మంది స్పెషల్ టీచర్లు లేకపోవడం, విద్యార్థులు ఎక్కువగా ఆడియో పాఠాల మీద ఆధారపడటం. కాని ఆడియో పాఠాలు విని సహాయకునితో పరీక్ష రాసి పాసైనప్పటికీ బ్రెయిలీ చదవడం, సొంతగా రాయడం రాక΄ోతే వారు నిరక్షరాస్యులు అవుతారు. తాముగా చదవగలం, రాయగలం అనే భావనే ఆత్మవిశ్వాసం ఇవ్వగలదు. ప్రతికూలతలను దాటి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా అంధత్వాన్ని జయించి ముందుకు సాగిన స్త్రీలు స్ఫూర్తిమంతంగా నిలుస్తున్నారు. చెన్నైకి చెందిన బెనో జెఫైన్ పుట్టుకతో అంధురాలైనా బ్రెయిలీలో చదువుకుంది. ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బ్యాంక్ ఆఫీసర్ అయ్యింది. అయినప్పటికీ ఇంకా సాధించాలనే ఉద్దేశంలో ఉద్యోగం చేస్తూనే బ్రెయిలీలో దొరికిన మెటీరియల్ చదివి 2015లో ఐ.ఏ.ఎస్ పరీక్షలు రాస్తే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యింది. ఇప్పటివరకు ఐ.ఎఫ్.ఎస్‌లో అంధులకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ మేరకు బెనో చరిత్ర సృష్టించింది. ఇప్పుడామె ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది. వివాహం చేసుకుని భర్త, కుమార్తెతో ముందుకు సాగుతోంది. బ్రెయిలీ భాష మాత్రమే ఆమెను ఇక్కడి వరకూ చేర్చింది. అలాగే ఢిల్లీకి చెందిన పాతికేళ్ల రేషమ్ తల్వార్ అక్కడి రేడియో ఉడాన్‌లో జాకీగా పని చేస్తోంది. పూర్తి అంధురాలైన రేషమ్‌ను తల్లిదండ్రులు అలాగే వదిలేయ దలచుకోలేదు. మామూలు విద్యార్థులతో΄ాటు కలిసి చదివేలా చేశారు. బ్రెయిలీలో స్కూలు పాఠాలు చదివించడంలో శ్రద్ధ చూపారు. రేషమ్ ఆగలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌గా నిలిచింది. అంతేకాదు, ఆ ఆత్మవిశ్వాసంతో రేడియో జాకీగా చేరింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టు గా పని చేస్తోంది. నిపుణుల సూచన ఇవాళ అంధ విద్యార్థులకు సాయపడే యాప్స్ (టెక్ట్స్‌బుక్స్‌ను ఆడియోగా మారుస్తాయి) ఉన్నప్పటికీ బ్రెయిలీలో చదవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పాఠ్యపుస్తకాలే కాదు సాహిత్యం, కథలు, పురాణాలు, గ్రంథాలు... ఏవి బ్రెయిలీలో అందుబాటులో ఉంటే అవన్నీ చదవడం వల్ల మాత్రమే అంధులకు తమ మీద తమకు విశ్వాసం ఏర్పడుతుందని సలహా ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు, ముఖ్యంగా అంధ విద్యార్థినులు బ్రెయిలీ భాషను నేర్చుకోవడం గురించి, ఆ విషయంలో వారు ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి విద్యాశాఖ దృష్టిపెట్టడం అవసరం. -
మానవ కంప్యూటర్
సాక్షి, కడప : కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయశర్మ గొప్ప గణిత మేధావిగా పేరు గాంచారు. దేశ, విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందినవారు. 1907 నవంబర్ 28న జన్మించారు. పుట్టుకతోనే చూపులేదు. అంధుడు పుట్టాడని పెంచడం కష్టమని.. గొంతు పిసికి దిబ్బలో పూడ్చేయాలని మంత్రసాని సలహా ఇచ్చింది. మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్ల గింజలు వేశారు. అయినా ఆ పసివాడు చావలేదు సరికదా.. చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు. ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు. ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు. అక్క బడికి వెళ్లి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. అలా ఆయనకు మామూలు పాఠాలతోపాటు గణితం బాగా వచ్చింది. అందులో అపార జ్ఞానం సాధించారు. అతని బాల్య దశలోనే తండ్రి చనిపోయారు. తల్లే పెంచింది. పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయశర్మ క్షణాల్లో చెప్పేవారు. రైతులు ఈ సాయానికి గానూ ఆయనకు అంతో.. ఇంతో డబ్బు ఇచ్చేవారు. ఆ వయసులోనే వయొలిన్ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు. తర్వాత వయొలిన్ వాయించడం జీవితంలో ఒక భాగమైంది. గణితంలో ప్రజ్ఞ సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు. పుట్టిన తేదీ, సంవత్సరం, ప్రదేశం, సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పేసేవారు. దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు. అలా ఆయన దేశమంతటా మొత్తం 6 వేల గణిత అవధానాలు చేశారు. వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి 20, 30 కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు. ప్రశ్న అడగ్గానే వయొలిన్‌ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవ దత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు. ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్ను ఓడించిందంటారు. అలాంటి శకుంతలాదేవినే ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ. ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు. గౌరవ పురస్కారాలు గణితంలో లక్కోజు గొప్పతనం తెలిసి.. దేశమంతటా ఎందరో గొప్పవాళ్లు ఆయన అవధానాలకు వెళ్లేవారు. మరికొందరు పెద్దలు ప్రత్యేకంగా అవధానం చేయించి విని ఆశ్చర్యపోయేవారు. 1959లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఢిల్లీలో లక్కోజుతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయించి, తిలకించారు. ఆ కార్యక్రమానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా హాజరయ్యారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తొలిసారిగా 1928లో గణిత అవధానం చేశారు. 1995 వరకు దేశమంతటా 6 వేల ప్రదర్శనలు ఇచ్చారు. 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి వందలాది లెక్కలకు బదులిచ్చారు. 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అప్పట్లో ఆయన సతీమణి వయసు 9 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1994 జనవరి 5న ఆమె శ్రీకాళహస్తిలో ఉండగా మరణించారు. సంజీవరాయశర్మ హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1997 డిసెంబర్ 2న కన్నుమూశారు. ప్రపంచం మొత్తాన్ని తన అద్భుతమైన గణిత విద్యతో ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి ఇంత వరకు ఈ భూమిపై మరొకరు పుట్టలేదని.. ప్రపంచంలోని గణిత మేధావులంతా ఎంతో ప్రశంసించారు. -
ఇందూరు.. అంధ ఓటర్లకు పరీక్షే!
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు అంధ ఓటర్లకు విషమ పరీక్ష పెట్టబోతున్నాయి. రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)కు 12 బ్యాలెట్ యూనిట్లతో అనుసంధానం చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. సాధారణ భాషలతో పాటు బ్రెయిలీ లిపిలో ముద్రించిన బ్యాలెట్ పత్రాలను బ్యాలెట్ యూనిట్లలో పొందుపరిచి ఎన్నికలు నిర్వహిస్తున్నా కూడా అంధ ఓటర్లకు కష్టాలు తప్పేలా లేవు. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 16 మంది చొప్పున 12 బ్యాలెట్ యూనిట్లలో 185 మంది అభ్యర్థుల పేర్లు, వారికి సంబంధించిన ఎన్నికల చిహ్నాలు పొందుపరిచి ఉంటాయి. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలోని పోలింగ్ కేంద్రాల్లో ఆంగ్ల అక్షరం ‘ఎల్’(ఔ) ఆకారంలో బ్యాలెట్ యూనిట్లను పేర్చి ఓటింగ్ కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కంపార్ట్మెంట్లోకి ఓటరును మాత్రమే అనుమతిస్తారు. అంధ ఓటర్లు కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాక ఒక్కో బ్యాలెట్ యూనిట్‌ను చేతితో స్పృశిస్తూ అభ్యర్థుల పేర్లను చదివి చివరకు తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థిని గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఏకంగా 12 బ్యాలెట్ యూనిట్లపై ఉండే 185 అభ్యర్థుల పేర్లు, ఆ తర్వాత ఉండే నోటా ఆప్షన్‌ను బ్రెయిలీ లిపి ద్వారానే గుర్తించాలి. ఈ ప్రక్రియలో కొంచెం పొరపాటు జరిగినా కూడా ఓటేయాలనుకున్న అభ్యర్థికి కాకుండా వేరే వారికి ఓటు పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే చాలా మంది అంధ ఓటర్ల ఓట్లు తారుమారు అవుతాయి. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 4,215 మంది అంధ ఓటర్లున్నట్లు గుర్తించారు. అంధ ఓటరుకు సహాయకుడిగా వెళ్లిన వ్యక్తి ఓటు రహస్యాన్ని కాపాడుతానని మాట ఇవ్వాల్సి ఉంటుంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా అంధ ఓటర్లకు తోడుగా సహాయకులను అనుమతించాలని ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే పోలింగ్ రోజు ఈ నిబంధనను ఎన్నికల సిబ్బంది అమలు చేసే అవకాశముంది. లేదంటే ప్రిసైడింగ్ అధికారులు సహాయకులను అనుమతించడానికి నిరాకరించే ప్రమాదముంది. -
ఫస్ట్ టైమ్.. ‘బ్రెయిలీ’ ఈవీఎం
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అనే ఆయుధం కీలకం. దాన్ని సరిగా వినియోగించుకోకుంటే అనర్థాలు అనేకం. మనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ‘రహస్య ఓటింగ్’ ద్వారా జరుగుతుంది. అయితే, దివ్యాంగులు, అంధులు, ఇతర శారీరక వైకల్యం ఉన్నవారికి మాత్రం రహస్య ఓటింగ్ అనేది గగనమైంది. ఓటు వేసేప్పుడు వారు ఇతరులపై ఆధారపడక తప్పడంలేదు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ తెలంగాణలో వికలాంగ సంక్షేమశాఖ, ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అంధుల కోసం ఏకంగా బ్రెయిలీ లిపిలో ఈవీఎంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతికి ప్రత్యేక ఫైలు పంపించింది. ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ పేరిట ఎన్నికల కమిషన్ విస్త్రృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రెయిలీ లిపిలో ఈవీఎంలు, బ్యాలెట్లు రాష్ట్రంలోని అంధ ఓటర్ల కోసం 31 జిల్లాల పరిధిలోని 217 పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ లిపి ఈవీఎంలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోని అంధుల ఓటర్లను ఆధారం చేసుకొని వీటిని అందుబాటులో ఉంచుతారు. ఇంకా ఓటరు గుర్తింపు కార్డు, బ్యాలెట్ పేపరు, ప్రచార కరపత్రాలను బ్రెయిలీ లిపిలో ప్రత్యేకంగా ముద్రిస్తున్నారు. బ్యాలెట్లు, ఈవీఎంలపై క్రమపద్ధతిలో అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తు బ్రెయిలీ లిపిలో ఉంటాయి. బ్యాలెట్‌ను చేతితో తడిమి గుర్తించాక ఈవీఎంల వద్దకు వెళ్లి ఎవరి సాయం లేకుండానే అంధులు ఓటు వేయవచ్చు. శారీరక వికలాంగులకు చక్రాల కుర్చీ శారీరక వికలాంగులైతే ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ చక్రాల కుర్చీ అందుబాటులో ఉంచనున్నారు. 32,796 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 20 వేల చక్రాల కుర్చీలు అవసరమని అంచనా. వీటిలో రెండు వేల కుర్చీలను వికలాంగుల సంక్షేమశాఖ సమకూర్చింది. వికలాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రత్యేక ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు. ఒక్కో ర్యాంప్‌కు రూ.8 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో తాత్కాలిక ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తారు. వీల్‌ఛైర్ గదిలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం ఇలా ప్రతీ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీచేసింది. ఇక పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వికలాంగులతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎన్నికల అధికారులకు సూచనలు ఇస్తున్నారు. అంధులు, బధిరుల కరపత్రాలతోపాటు వీటినీ పంపిణీ చేస్తారు. రెండు మూడు నియోజకవర్గాల్లో వారి ప్రభావం.. రాష్ట్రంలో కనీసం రెండు మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను దివ్యాంగ ఓటర్లు ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 6,39,276 మంది దివ్యాంగులు ఉన్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 38,958 మంది ఉన్నారు. తరువాత స్థానాల్లో రంగారెడ్డి జిల్లాలో 37,147 మంది, ఖమ్మంలో 34,110, హైదరాబాద్‌లో 33,362, కరీంనగర్జిల్లాలో 30,643, మహబూబ్‌నగర్ జిల్లాలో 30,169 మంది ఓటర్లున్నారు. కొమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల్లో పదివేల లోపు ఓటర్లుండగా, మిగిలిన జిల్లాల్లో 14 వేలకు తగ్గకుండా దివ్యాంగ ఓటర్లున్నారు. అయితే దివ్యాంగ ఓటర్లు ఇంకా కొంతమేరకు పెరిగే అవకాశముందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం 7.40 లక్షలు ఉండే అవకాశముందని అంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందంటున్నారు. ..::: బొల్లోజు రవి ఎన్నో సదుపాయాలు ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులు పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బ్రెయిలీ లిపిలో గుర్తింపు కార్డులు, ఈవీఎంలు ఈ చర్యల్లో భాగమే. బధిర ఓటర్ల కోసం సంజ్ఞల భాషలో కరపత్రాన్ని రూపొందించాం. ఎన్నికల సామగ్రితోపాటు వీటినీ అధికారులకు అందజేస్తాం. ఓటు వేయడానికి వచ్చే బధిరులను కరపత్రంలో సూచించిన సంజ్ఞలతో అధికారి సమన్వయం చేసుకుంటారు. కరపత్రంలో 11 అంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. పోలింగ్ కేంద్రానికి వచ్చింది మొదలు వెళ్లే వరకు బధిర ఓటరును ఎన్నికల అధికారి సంజ్ఞల ద్వారా ఆయా విషయాలు అడుగుతారు. ఉదాహరణకు ‘మీ పేరు, వినికిడి లోపమా?, మాట్లాడలేరా?, ఓటరు కార్డు స్లిప్ చూపించండి, లిస్ట్‌లో పేరుందా, ఎడమ చేతిపై సిరా వేయించుకోండి, సిరాను ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు, ధన్యవాదాలు’ అనే సంజ్ఞల భాషతో కరపత్రం ఉంటుంది. – బీ.శైలజ, రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి -
ఆ చిట్టిబాబుకు బ్రెయిలీ లిపి ఇచ్చారు!
ఇల్లినాయిస్ : ఒక్కోసారి మనం చేసే చిన్న పొరపాట్ల వలన నవ్వులపాలు కావాల్సి వస్తుంది. అమెరికన్ మోడల్, నటుడు నైల్ డామార్కోకు ఇల్లినాయిస్ ఎయిర్‌పోర్టులో వింత అనుభవం ఎదురైంది. వినికిడి లోపం ఉన్న ఈ నటుడికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని భావించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది చేసిన పొరపాటు ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తోంది. నైల్‌కు ప్రత్యేకంగా సహాయం చేసేందుకు.. ఆయనకు బ్రెయిలీ లిపిలో ఉన్న సేఫ్టీ మాన్యువల్ అందించారు. సరిగ్గా చెవులు వినపడని తనకు బ్రెయిలీలోని సెఫ్టీ మాన్యువల్ ఎలా ఉపయోగపడుతుందో అర్థంకాక ఆయన తల గోక్కున్నారు. ఇదే విషయాన్ని నైల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘వారు నాకు బ్రెయిలీ లిపిలో ఉన్న సేఫ్టీ మాన్యువల్ అందించారు. ఎందుకంటే నేను చెవిడివాడిని. ఇది పిచ్చితనమే కదా.. నేను వినలేను అంటే దాని అర్థం నాకు బ్రెయిలీతో అవసరం ఉందని కాదు’ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఇదివరకు ఎన్నోసార్లు తాను ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని, ఇది వారికి కొత్తేంకాదని తెలిపాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. -
తల్లి కళ్లు దానమిచ్చిన జడ్జి
సాక్షి, హైదరాబాద్: అంధుల కోసం కఠినమైన చట్టాలను బ్రెయిలీ(తెలుగు) లిపిలోకి అనువదించడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ న్యాయసేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి...తన మాతృమూర్తి కళ్లను దానం చేశారు. ఆయన తల్లి అనసూయమ్మ(82) ఇటీవల మహబూబ్‌నగర్‌లో మృతి చెందారు. మరణానంతరం కళ్లను దానం చేయడానికి బతికుండగా ఆమె అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో...కళ్లను తీసుకెళ్లాల్సిందిగా ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య సంస్థకు సమాచారం ఇవ్వడంతో వారు కళ్లను తీసుకెళ్లారు. -
చూపులేని వారి చుక్కాని
యాదేశ్వరి అంధురాలు కాకపోయినా బ్రెయిలీ లిపిని ఇష్టంగా నేర్చుకున్నారు. బ్రెయిలీలో పుస్తకాలు అచ్చు వేయించి అంధ విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. ఇతర అంధులకు సైతం తన పుస్తకాల ద్వారా దైవచింతన, ఆధ్యాత్మికత కలిగిస్తున్నారు. ఇప్పటికి ఆరొందలకు పైగా పుస్తకాలను ముద్రించి పంచిపెట్టారు. మరి యాదేశ్వరిని ఇలాంటి వినూత్న సేవాదృక్పథం వైపు ప్రేరేపించిన అనుభవాలు ఏమిటి? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం... మాది మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ గ్రామం. గద్వాలలో టెన్త్ వరకు చదివాను. అక్కడే రాణి మహాలక్ష్మీదేవమ్మ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివాను. 1986లో ఇంటర్ పూర్తికాగానే ధన్వాడకు చెందిన టీచర్ జయశంకర్‌తో నా వివాహం అయింది. పెళ్లీడు కాకపోయినప్పటికీ అమ్మానాన్నల అభీష్టానికి అడ్డు చెప్పలేదు. 1987లో బాబు పుట్టాడు. తర్వాత నా భర్త సహకారంతో టీటీసీ పూర్తిచేశాను. బీఏ కూడా పాసయ్యాను. ప్రస్తుతం కొత్తకోట బాలికల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాను. జీవితాన్నే మార్చిన ఘటన బాబు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఓ రోజు ఉదయం ఇంట్లో కిరోసిన్ స్టౌ మీద వంటచేస్తూ, నా పనిలో నేనున్నాను. ఇంతలో బాబు ఆడుకుంటూ స్టౌ దగ్గరికి వెళ్లాడు. స్టౌ మంటల్ని పట్టుకోబోయాడు. గాబరాతో పరుగెత్తుకు వెళ్లి స్టౌను ఊదేశాను. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి కళ్లు అంటుకున్నాయి. చుట్టూ అంధకారం. రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. పక్కింట్లో ఉంటున్న లక్షి్ష్మ పరుగెత్తుకొచ్చి పెరుగులో తడిపిన పత్తిని తీసుకువచ్చి నా కళ్లపై ఉంచింది. మూడురోజుల పాటు నాకు కళ్లు కనిపించలేదు. ఇక ఈ లోకాన్ని చూడలేనేమోననుకున్నా! మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లాం. చూపైతే వచ్చింది కానీ.. ‘భవిష్యత్‌లో ఇబ్బంది తలెత్తదని చెప్పలేం’ అని డాక్టర్ అన్నారు. రెండురోజులు కళ్లు లేకపోతేనే జీవితం అంధకారం అయిపోయిందే.. ఇక పుట్టుక నుంచి అంధులుగా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అప్పుడు ఆలోచించాను. రోజులు గడుస్తున్న కొద్దీ, చూపులేనివారికి నా వంతుగా ఏమైనా చేయాలని అనిపిస్తుండేది. ఆ సమయంలోనే 1989లో నాకు టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే అంధులకు ఏదైనా చేయాలన్న తపనతో 1996లో బ్లైండ్ డిప్లొమా (బ్రెయిలీ లిపిలో) పూర్తిచేశాను. మనోబలమే అంతర్నేత్రం ఆధ్యాత్మికంగా, మానసికంగా బలంగా ఉంటే అంధత్వాన్ని ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదని నా నమ్మకం. రోజూ మూడు నుంచి నాలుగు గంటలు కుస్తీ పట్టి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ వాటిని బ్రెయిలీ లిపిలో రాయడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాలను కూడా బ్రెయిలీ లిపిలో రాసి విద్యార్థులకు అందజేశాను. ఇలా క్రమంగా ఇతర రచనల వైపు దృష్టిమళ్లింది. పురాణేతిహాసాలు, భారతభాగవతాదులు, నీతికథల పుస్తకాలను బ్రెయిలీలో రాసి అచ్చు వేయించి పంచిపెడుతున్నాను. తల్లిగా అదృష్టవంతురాలిని తొమ్మిదేళ్ల క్రితం అనుకోని సంఘటనలో నా భర్త జయశంకర్ మరణించారు. అదే నా జీవితంలో విషాదకరమైన సంఘటన. ఆ తరువాత మా అబ్బాయి నరేంద్రనాథ్ అన్నీతానై చూసుకుంటున్నాడు. ప్రస్తుతం మైసూరు, మాండ్య జిల్లాలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. తన సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది. ఏ తల్లికైనా ఇటువంటి కొడుకు పుడితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది. టీచర్‌గా పనిచేస్తున్నా.. ఇప్పటికీ బ్రెయిలీలిపిలో పుస్తకాలు రాయకుండా ఉండలేను. వంటచేయడం సరిగ్గా రాదుకానీ ఈ లిపిలో మాత్రం మంచిప్రావీణ్యం సంపాదించాను. (నవ్వుతూ) - ముంగల్శెట్టి వెంకటయ్య సాక్షి, మహబూబ్‌నగర్ డెస్క్ సృష్టి సమ్మాన్ అవార్డు ప్రతిరోజూ కనీసం గంటపాటు పుస్తకాలు చదువుతాను. వాటిని బ్రెయిలీ లిపిలోకి రాస్తాను. అలా మొదట 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి మార్చాను. గణపతి సచ్చిదానంద స్వామివారు ఇచ్చిన బ్రెయిలీప్రింటర్ సహాయంతో పాఠ్యపుస్తకాలను అచ్చువేసి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అంధుల పాఠశాలతో పాటు అనంతపురం జిల్లా హిందూపురం, హైదరాబాద్‌లోని మలక్‌పేట అంధుల ఆశ్రమపాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందజేయగలిగాను. భగవద్గీత, బైబిల్, ఖురాన్, మహాభారతం, రామాయణం, భాగవతం, జీవిత చరిత్రల పుస్తకాలను బ్రెయిలీ లిపిలో లిఖించగలిగాను. నా పుస్తకాల్లో ‘గురుచరిత్ర’ మరచిపోలేనిది. ఇటీవల కొమురం భీం, ప్రొఫెసర్ జయశంకర్ జీవితచరిత్రలను బ్రెయిలీ లిపిలోకి అనువాదం చేశాను. యాదగిరిగుట్ట ప్రాశస్త్యాన్ని ఈ లిపిలోనే రాశాను. సచ్చిదానంద స్వామీజీ వారి వెయ్యి సూక్తులు కలిగిన బ్రెయిలీలిపి ‘విజయశంకర’ పుస్తకం నాకు మరింత పేరు తెచ్చిపెట్టింది. బ్రెయిలీలో దాదాపు 600 పుస్తకాలకు పైగా రచించినందుకు న్యూఢిల్లీలో ‘సృష్టి సమ్మాన్’ అవార్డు అందుకున్నాను. -
బ్రెయినీ పిల్లాడి బ్రెయిలీ ప్రింటర్
అమావాస్య చీకటి లాంటి అంధుల జీవితంలో పున్నమి వెలుగును పంచిన వ్యక్తి లూయీ బ్రెయిలీ. అంధులకంటూ ఒక ప్రత్యేకమైన లిపిని రూపొందించి వారికి ఒక వరాన్నిచ్చాడాయన. అయితే అది అందరికీ అందుబాటులోకి రావడం లేదు. ఎందుకంటే... అంధులకోసం పుస్తకాలను ముద్రించే ప్రింటర్ల ఖరీదు చాలా ఎక్కువ. ఫలితంగా బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాల ధర లు కూడా ఎక్కువే! ప్రత్యేకించి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు చెందిన అంధులకు బ్రెయిలీ లిపిలోని పుస్తకం కొనడం తలకు మించిన భారమే! దీంతో అంధుల కోసం తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి, సరికొత్త ప్రింటర్‌ను రూపొందించాడు క్యాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయ కుర్రాడు శుభమ్ బెనర్జీ (12). . ‘‘ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ దారిలో కొంతమంది వ్యక్తులు ‘అంధుల సంక్షేమార్థం’ నిధులు సేకరించడాన్ని గమనించాను. ఇంటికి వెళ్ళాక కూడా ఆ దృశ్యం నన్ను వెంటాడింది. అంధుల చుట్టూనే నా ఆలోచనలన్నీ తిరిగాయి. ఇంతకీ అంధులు ఎలా చదువుకొంటారు? అనే సందేహం వచ్చింది. ఆ విషయాన్నే అమ్మానాన్నలను అడిగితే, ‘వెళ్లి ‘గూగుల్’ లో చూడు’ అన్నారు. అలా అంధులపై నా పరిశోధన మొదలైంది’’ అని శుభమ్ చెప్పుకొచ్చాడు. అంధులు బ్రెయిలీ లిపి ద్వారా చదువుతారని తెలుసుకొన్న శుభమ్ బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్ల ఖరీదు కూడా ఎక్కువని అర్థం చేసుకొన్నాడు. అసలే వైకల్యంతో బాధపడుతున్న వాళ్లకు అలా ప్రింటర్ల ధర, పుస్తకాల ధర కూడా ఎక్కువగా ఉండడం ఏమిటా అన్న ఆలోచనలో పడ్డాడు. ‘‘వారికోసం తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంచొచ్చు కదా? అనే ఆలోచన వచ్చింది, సమాధానం కూడా నేను ఇచ్చుకోవాలనుకొని బ్రెయిలీ ప్రింటర్ రూపకల్పనకు పూనుకొన్నాను’’ అని క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో సెవన్త్ గ్రేడ్ చదువుతున్న ఈ అబ్బాయి చెప్పాడు. బ్రె యిలీ ప్రింటర్ ఎలా పనిచేస్తుందనే విషయం గురించి పరిశోధించాడు. ఓ పక్కన స్కూలులో ఇచ్చిన ఎసైన్మెంట్లు చేసుకొని, ఆ తరువాత ఈ నవీన ఆవిష్కరణ కోసం కుస్తీలు పట్టేవాడు. ఈ చిన్న కుర్రాడు ఒక్కో రోజున అర్ధరాత్రి 2 గంటల దాకా మెలకువగా ఉండి మరీ పని చేసేవాడు. చివరకు తక్కువ ఖర్చులో బ్రెయిలీ ప్రింటర్ నమూనాను రూపొందించాడు. ‘‘నా ఊహాల్లోని ప్రింటర్‌కు నా తల్లితండ్రుల సహకారంతో ఒక రూపాన్నిచ్చాను. అది విజయవంతమైంది’’ అన్నాడు శుభమ్. అతను రూపొందించిన ఈ ప్రింటర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఉన్న ఫైల్స్‌కు కాగితంపై అక్షర రూపాన్నిస్తుంది. అయితే దాన్ని మార్కెటింగ్ చేసే ఉద్దేశం అతనికి లేదు. ‘‘నేను వ్యాపారిని కావడానికి దీన్ని రూపొందించలేదు. అంధుల సౌకర్యార్థమే ఈ ప్రయత్నం. అది విజయవంతం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే... ఇది పెద్ద ఎత్తున పుస్తకాల తయారీకి ఉపయోగపడదు. ఎవరికి వారు తమ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కిట్ గురించి పూర్తి వివరాలు నా వెబ్సైట్లో ఉన్నాయి. కావాలనుకొనే వాళ్లు ఆర్డర్ చేయవచ్చు. మీరే ఇంటి దగ్గర ఆ కిట్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు’’ అని శుభమ్ బెనర్జీ వివరించాడు. ఈ మధ్య అమెరికాలోని ఓ సైన్స్ ప్రదర్శనలో శుభమ్ తన నమూనాను ప్రదర్శించినప్పుడు అందరూ ఆసక్తిగా గమనించారు. చూపు లేనివారికి ఉపయోగపడే ఈ కారు చౌక ప్రింటర్ ఇప్పుడు పెద్ద సంచలనమైంది. అమెరికన్ మీడియా అంతా చిన్న వయసులోనే పెద్ద మేధావి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఖరీదు తక్కువ! సాధారణంగా ఒక బ్రెయిలీ ప్రింటర్ ఖరీదు లక్షా ఇరవై వేల రూపాయల వరకూ ఉంటుంది. అయితే శుభమ్ బెనర్జీ రూపొందించిన మోడల్ ప్రింటర్ ఖరీదు కేవలం ఇరవై వేల రూపాయలకే అందుబాటులో ఉంటుంది. దీని పేరు ‘బ్రెయిగో’. అంధులకు లిపిని రూపొందించిన లూయీ బ్రెయిలీ పేరు, అందుకు సంబంధించిన ప్రింటర్ లెగో పేరు కలుపుతూ తన కొత్త ప్రింటర్‌కు ‘బెయిగో’ అని పెట్టాడు. -
అంధుల కోసం.... రైలు బోగీలో బ్రెయిలీ లిపి
న్యూఢిల్లీ: రైలు ప్రయాణం చేసే అంధుల కోసం ప్రత్యేక సదుపాయం కలిగిన ఏసీ బోగీని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. సీట్ల నుంచి తలుపులు, బెర్త్‌లు, వాష్ బేసిన్లు, మరుగుదొడ్లు లాంటి వివరాలన్నీ బ్రెయిలీ లిపిలో ఉండటం ఈ బోగీ ప్రత్యేకత. ఢిల్లీ నుంచి పూరీ మధ్య నడిచే పురుషోత్తం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. చెన్నైలో తయారైన ఈ బోగీని ఈ నెలాఖరులోగా పురుషోత్తం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో అందుబాటులోకి తెస్తామని రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.