న్యూఢిల్లీ: రైలు ప్రయాణం చేసే అంధుల కోసం ప్రత్యేక సదుపాయం కలిగిన ఏసీ బోగీని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. సీట్ల నుంచి తలుపులు, బెర్త్‌లు, వాష్ బేసిన్లు, మరుగుదొడ్లు లాంటి వివరాలన్నీ బ్రెయిలీ లిపిలో ఉండటం ఈ బోగీ ప్రత్యేకత.
ఢిల్లీ నుంచి పూరీ మధ్య నడిచే పురుషోత్తం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. చెన్నైలో తయారైన ఈ బోగీని ఈ నెలాఖరులోగా పురుషోత్తం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో అందుబాటులోకి తెస్తామని రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
అంధుల కోసం.... రైలు బోగీలో బ్రెయిలీ లిపి
Published Mon, Feb 17 2014 3:10 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement
Advertisement