సాక్షి, హైదరాబాద్: అంధుల కోసం కఠినమైన చట్టాలను బ్రెయిలీ(తెలుగు) లిపిలోకి అనువదించడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ న్యాయసేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి...తన మాతృమూర్తి కళ్లను దానం చేశారు. ఆయన తల్లి అనసూయమ్మ(82) ఇటీవల మహబూబ్‌నగర్‌లో మృతి చెందారు. మరణానంతరం కళ్లను దానం చేయడానికి బతికుండగా ఆమె అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో...కళ్లను తీసుకెళ్లాల్సిందిగా ఎల్‌వీ ప్రసాద్ నేత్రవైద్య సంస్థకు సమాచారం ఇవ్వడంతో వారు కళ్లను తీసుకెళ్లారు.