న్యూయార్క్ : ఫోర్న్ వీడియోలను ఆస్వాదించలేకపోతున్నానంటూ ఒక దివ్యాంగుడు మూడు ఫోర్న్ వెబ్‌సైట్లపై పిటిషన్ దాఖలు చేసిన వింత ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన యారోస్లావ్ సూరిస్ పుట్టకతోనే చెవిటివాడు. తాము చెవిటివాళ్లం కావడంతో అశ్లీల వీడియోలకు క్యాప్షన్ లేకపోవడం వల్ల సాధారణ మనుషుల్లాగా వీడియోను ఎంజాయ్ చేయలేకపోతున్నాం అంటూ గురువారం న్యూయార్క్‌లోని బ్రూక్‌లిన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఫోర్న్ వీడియోలు ప్రసారం చేసే ఫోర్న్ హబ్, రెడ్ ట్యూబ్, యూ ఫోర్న్ వెబ్‌సైట్లతో పాటు కెనెడియన్ పేరెంటింగ్ కంపెనీ మైండ్‌గ్రీక్‌పై కేసు నమోదు చేశాడు. అంతేగాక ఈ వెబ్‌సైట్లు అమెరికన్ వికలాంగుల చట్టాన్ని ఉల్లఘించి తమపై వివక్షతను చూపారంటూ సూరిస్ పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.
'ఫోర్న్ వీడియోలకు క్యాప్షన్ లేకపోతే దివ్యాంగులు వీడియోను ఎలా చూడగలరు. ఒక సాధారణ మనుషుల్లాగా మేము వీడియోనూ చూడలేమంటూ' 23 పేజీల పిటిషన్‌లో సూరిస్ తెలిపాడు. ఫోర్న్ వెబ్‌సైట్స్‌లో క్లోజ్‌డ్ క్యాప్షన్స్‌ను జత చేయాలని తాను కోరుతున్నట్లు సూరిస్ పేర్కొన్నాడు. ఇదే విషయమై ఫోర్న్‌హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరీ ప్రైస్ స్పందిస్తూ.. తమ వైబ్‌సైట్‌లో క్లోజ్‌డ్ క్యాప్షన్ ఆప్షన్ ఉందని, దానిని ఎంచుకోవాలంటే అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment