
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(బెంగళూరు): ఇంట్లో అద్దెకు ఉండే యువతిని పిస్తోల్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇంటి యజమానిని ఆదివారం అశోక్‌నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన అనిల్ రవి శంకర్‌ప్రసాద్ నిందితుడు. టైల్స్ వ్యాపారం కోసం ఇతను నగరంలో ఉంటున్నారు. ఇతని ఇంట్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి గత మార్చి నుంచి బాడుగకు ఉంటోంది. ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువతి ఇంటికి తరచూ స్నేహితులు వస్తుండటంతో అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
కొద్దిరోజుల క్రితం యువతి స్నేహితుడితో కలిసి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని కేసు పెట్టిస్తానని బెదిరించాడు. ఏప్రిల్ 11న యువతి ఇంటిలోకి వచ్చిన అనిల్ తన లైసెన్స్ రివాల్వర్‌తో వచ్చి బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
చదవండి: ప్రేమను చంపుకోలేక.. ప్రాణం తీసుకుంది
Comments
Please login to add a commentAdd a comment