![Man Molestation On Minor Girl Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/14/Untitled-5_0.jpg.webp?itok=IZ_vAIaY)
ప్రతీకాత్మక చిత్రం
హోసూరు(బెంగళూరు): అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై భవన నిర్మాణ కార్మికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. డెంకణీకోటకు చెందిన శామ్‌రాజ్(44) హోసూరు శాంతి నగర్‌లో నివాసముంటూ భవన నిర్మాణ పనులకు వెళ్లేవాడు. అదే ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ ఆశచూపి లోపలికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హొసూరు పట్టణ పోలీసులు శామ్‌రాజ్‌ను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు.
కిలేడీల చేతివాటం
హోసూరు: హొసూరు–బాగలూరు రోడ్డులో దోపిడీకి పాల్పడిన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని బాపునగర్‌కు చెందిన జ్యోతి(30), సబీన(25), జ్యోతి(32) అనే దొంగలను హడ్కో పోలీసులు అరెస్ట్ చేశారు. హొసూరులోని అణ్ణా నగర్‌కు చెందిన ఉమామహేశ్వరి అనే మహిళ హొసూరు–బాగలూరు రోడ్డులో బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉండగా నిందితులు ఆమెతో మాటలు కలిపి పర్సు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
చదవండి: NEET PG Exam 2022: నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment