Four Youth Molestation Minor Girl In Bangarupeta Karnataka: ఇంట్లో అలిగి బస్టాండ్‌కు వెళ్లిన మైనర్‌.. - Sakshi

ఇంట్లో అలిగి బస్టాండ్‌కు వెళ్లిన మైనర్‌.. నలుగురు నమ్మించి తీసుకెళ్లి..

Feb 20 2022 5:35 AM | Updated on Feb 20 2022 11:24 PM

Four Youth Molestation Minor Girl Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కేజీఎఫ్‌: బంగారుపేట తాలూకాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు... తన పుట్టిన రోజు నాడు కూడా కొత్త దుస్తులు కొనివ్వలేదని అలిగి తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

ఆటోలో బంగారు పేటకు చేరుకుంది. బస్టాండ్‌ వద్ద ఉండగా ఆనంద్‌కుమార్, కాంతరాజు, ప్రవీణ్, వేణు అనే యువకులు బాలికకు పని ఇప్పిస్తామని నమ్మించి కామసముద్రం ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉడాయించారు. దారిన వెళ్తున్న కొందరు బాలిక పరిస్థితిని చూసి బంగారుపేట ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి పోక్సో కేసు నమోదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement