ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మాట్లాడాలని పిలిచి మూడు రోజులు.. | Karnataka: Youth Molestation Lover Over Not Accepting Marriage | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మాట్లాడాలని పిలిచి మూడు రోజులు..

Published Sun, Jun 12 2022 7:53 AM | Last Updated on Sun, Jun 12 2022 8:08 AM

Karnataka: Youth Molestation Lover Over Not Accepting Marriage - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైసూరు(బెంగళూరు): మైనర్‌ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఇంట్లో మూడురోజులు బంధించి అత్యాచారం చేశాడో కామాంధుడు. వివరాలు... హెచ్‌డి కోటె తాలూకాలోని కారాపురకి చెందిన నిందితుడు అరుణ్‌. మైసూరులో ఉండే 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టాడు. తల్లిదండ్రులు బాలికకు ఇటీవల వేరొకరితో నిశ్చితార్థం నిర్ణయించారు.

దీంతో అరుణ్‌ బాలికకు ఫోన్‌ చేసి నీతో మాట్లాడాలి అని చెప్పి మైసూరు నుంచి బాలికను తీసుకెళ్లి నంజనగూడులో ఉన్న తన పిన్నమ్మ అశ్విని ఇంటికి తెచ్చాడు. అక్కడ మూడురోజుల పాటు బాలికను ఉంచి తననే పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఆమె ఒప్పుకోక పోవడంతో అత్యాచారం చేశాడు. ఆమె దగ్గరున్న నగలను తీసుకుని బాల మందిరం వద్ద వదిలి వెళ్లాడు. బాల మందిరం వారి సహకారంతో బాలిక కుటుంబం చెంతకు చేరింది. నంజనగూడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇంతలో అరుణ్, అతనికి సహకరించిన పిన్నమ్మ అశ్విని, సోదరుడు అభి పరారయ్యారు.

చదవండి: అల్లరి చేస్తున్నాడని కొడితే.. ప్రాణమే పోయింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement