పరిచయస్తుడని నమ్మితే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. | Karnataka: Youth Molestation 14 Year Girl Doddaballapura | Sakshi
Sakshi News home page

పరిచయస్తుడని నమ్మితే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

Apr 1 2022 5:24 PM | Updated on Apr 1 2022 6:25 PM

Karnataka: Youth Molestation 14 Year Girl Doddaballapura - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): పరిచయస్తురాలైన బాలికపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన మంగళూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ శివారులోని ఇడ్యా నివాసి అయిన నిందితుడుకి 14 ఏళ్ల బాలికతో పరిచయం ఉంది. ఈ పరిచయాన్నే అలుసుగా తీసుకున్న యువకుడు బాలికను తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేసాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సురత్కల్‌ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటనలో..

వివాహిత అనుమానాస్పద మృతి
హిందూపురం: అత్తింటి వేధింపుల నేపథ్యంలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి చెందిన ఘటన హిందూపురం లక్ష్మిపురంలో చోటు చేసుకుంది. పొరుగున చిక్కబళ్లాపురం తాలూకా పేరేసంద్రకు చెందిన మోనిసా (34)కు హిందూపురానికి చెందిన రియాజ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా భర్తతో పాటు అత్త ఫిరోజ్‌బీ పుట్టింటినుంచి డబ్బు తీసుకురావాలని వేధించసాగారు. ఈ తరుణంలో మోనిసా బు«ధవారం రాత్రి ఇంటి పైకప్పు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తింటివారు చెబుతున్నారు. గురువారం ఉదయం మృతురాలి బంధువులు వచ్చి డబ్బు కోసమే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆరోపించారు. ఈ మేరకు టూ టౌన్‌సీఐకు ఫిర్యాదు చేశారు. మృతురాలికి నాలుగేళ్ల కొడుకు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. డీఎస్పీ రమ్య విచారణ చేపట్టారు.

చదవండి: ట్రావెల్‌​ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్‌ సీన్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement