బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని.. | Youth Arrested For Molestation On Minor Girl West Godavari | Sakshi
Sakshi News home page

బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని..

Published Tue, Mar 29 2022 3:19 PM | Last Updated on Tue, Mar 29 2022 3:32 PM

Youth Arrested For Molestation On Minor Girl West Godavari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,నరసాపురం(పశ్చిమ గోదావరి ): 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నరసాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమ వారం అరెస్ట్‌ చేశారు. టౌన్‌ ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన బాలిక 9వతరగతి చదువుతోంది.

యలమంచిలికి చెందిన 25 ఏళ్ల యువకుడు బాలిక ఇంటికి దగ్గరలోనే టైల్స్‌ పనికి వెళ్లేవాడు. ఆదివారం బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని దిండి సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే బైక్‌పై ఇంటి వద్ద దింపి.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆరాతీసి పోలీసులను ఆశ్రయించారు. యువకుడిపై పోక్సో చట్టం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

చదవండి: ‘అమ్మా.. అమ్మా’ అని కేక వేసే లోగానే దారుణం జరిగిపోయింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement