మంచి ఉద్యోగం రావాలంటే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మంచి మార్కులుంటేనే ఇల్లు అద్దెకు లభిస్తుంది. వినటానికి ఇది కొత్తగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. ఈ సంఘటన ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులో వెలుగులోకి వచ్చిన సంఘటనలో హౌస్ బ్రోకర్, హౌస్ ఓనర్, రెంట్ కోసం వచ్చిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ట్విటర్ అకౌంట్ ద్వారా వైరల్ అయింది. ఇందులో 'మీ మార్కులు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయో లేదో తెలియదు కానీ బెంగళూరులో అద్దెకి ఉండాలంటే మాత్రమే నిర్ణయించేది మీ మార్కులే' అని శుభ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంతో బెంగళూరులో ఒక ఇంటి ఓనర్ మా కజిన్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వలేదని, ఇది అస్సలు నమ్మలేకపోతున్నానని శుభ్ ట్వీట్ చేశారు. నిజానికి యోగేష్ అనే వ్యక్తి అద్దె ఇంటికోసం బ్రోకర్ ని సంప్రదించాడు. అతడి ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసిన హౌస్ ఓనర్ లింక్డ్ఇన్, ట్విట్టర్ వంటి ఫ్రొఫైల్స్ తో పాటు పదవతరగతి, ఇంటర్ మార్క్స్ కార్డ్స్, పాన్, ఆధార్ కార్డుతో పాటు 150 నుంచి 200 పదాల్లో తన గురించి ఇంట్రో రాసి పంపాలని చెప్పాడు.
(ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..)
హౌస్ ఓనర్ చెప్పినవన్నీ యోగేష్ చేశారు. అయితే ఇంటర్‌లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంగా ఇల్లు అద్దెకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన సమాచారం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ఇప్పటికి 15 లక్షల మందికి పైగా చూసారు. కొంతమంది రాబోయే రోజుల్లో బెంగళూరులో అద్దె ఇంటికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా పెడతారేమో అంటూ కామెంట్ చేసాడు.
"Marks don't decide your future, but it definitely decides whether you get a flat in banglore or not" pic.twitter.com/L0a9Sjms6d
— Shubh (@kadaipaneeeer) April 27, 2023
ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment