ఇంట్లో ఎవరూ లేరు...ఇక తనకు అడ్డే లేదని ధైర్యంగా తలుపు తాళాలు పగులగొట్టి దొంగతనానికి ఉపక్రమించిన ఓ వ్యక్తి.. అనుకోకుండా ఇంటి యజమానికి దొరికిపోయాడు.
కోస్గి(మహబూబ్‌నగర్): ఇంట్లో ఎవరూ లేరు...ఇక తనకు అడ్డే లేదని ధైర్యంగా తలుపు తాళాలు పగులగొట్టి దొంగతనానికి ఉపక్రమించిన ఓ వ్యక్తి.. అనుకోకుండా ఇంటి యజమానికి దొరికిపోయాడు. సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు..రామాలయం చౌరస్తా సమీపంలో దోమ ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ప్రసాద్ కుటుంబసభ్యులు బంధువుల ఇంటికి వెళ్లారు.
ఇంటి సమీపంలోనే టైలర్‌గా పనిచేసే బండ రాము అనే యువకుడు రాత్రి పది గంటల సమయంలో ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలి నుంచి గడియ వేసుకొని బీరువా తాళాలు పగుల గొడుతుండగా ప్రసాద్ ఇంటికి వచ్చాడు. లోపలి నుంచి శబ్దాలు వస్తుండడం, తాళాలు పగిలి ఉండటం గమనించాడు. అతడు బయటి నుంచి గడియ పెట్టి చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవటంతో అందరూ కలసి ఇంట్లో చిక్కిన రామును పట్టుకున్నారు.