జగద్గిరిగుట్టలో పేలుడు పదార్ధాలు స్వాధీనం
Published Fri, Sep 30 2016 3:41 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రావి నారాయణ రెడ్డి నగర్‌లో భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన గురుజిత్ సింగ్(45), రమాదేవి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 250 డిటోనేటర్లు, 171 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement