explosive material
-
నలుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు
కాళేశ్వరం/గడ్చిరోలి: తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే కార్డెక్స్ వైర్ బండల్స్‌ను సరఫరా చేస్తున్న నలుగురు ఆదివారం గడ్చిరోలి జిల్లా పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ అంకిత్‌గోయల్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అహేరి తాలూకా దామ్రాంచ–బంగారంపేట గ్రామాల అటవీ ప్రాంతాల మీదుగా 20 కార్డెక్స్ వైర్ బండిల్స్ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పీఎస్సై సచిన్ ఘడ్కే ఆధ్వర్యంలో క్యూఆర్టీ పోలీసుల బలగాలతో మాటువేసి పట్టుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులైన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజుగోపాల్ సల్ల, మహ్మద్ ఖాసీం షాదుల్లా, గడ్చిరోలి జిల్లాకు చెందిన కాశీనాథ్, సాధుల లచ్చాతలండి పట్టుబడగా, వీరి నుంచి 3,500 కార్డెక్స్ వైర్ బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వీటిని వివిధ లాంచర్లు, హ్యాండ్‌గ్రనేడ్లు, ఐఈడీఎస్ తయారీలో ఉపయోగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. -
జపాన్ నౌకపై పేలుడు ఇరాన్ పనే
ఫుజైరా: ఒమన్ సింధుశాఖ వద్ద గతవారం జపాన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై పేలుడు కోసం వాడిన మందుపాతర ఇరాన్‌దేనని అమెరికా బుధవారం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అమెరికా నౌకాదళంలో సెంట్రల్ కమాండ్ కమాండర్ సియాన్ మాట్లాడుతూ ‘జపాన్ నౌకపై పేలుడు కోసం వాడిన మందుపాతరకు, గతంలో ఇరాన్ తమ సైనిక కవాతుల్లో ప్రదర్శించిన మందుపాతరలకు చాలా పోలికలు ఉన్నాయి. అలాగే జపాన్ నౌకపై దాడికి వచ్చిన వారి వేలిముద్రలు సహా బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించాం’ అని వివరించారు. -
హైదరాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు
హైదరాబాద్: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గ నగర్ వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన బొలెరోను తనిఖీ చేసి అందులో ఉన్న 2 వేల జిలెటిన్ స్టిక్స్, 2 వేల డిటోనెటర్స్ స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు. -
జగద్గిరిగుట్టలో పేలుడు పదార్ధాలు స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రావి నారాయణ రెడ్డి నగర్లో భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన గురుజిత్ సింగ్(45), రమాదేవి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 250 డిటోనేటర్లు, 171 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ శివరాంపల్లిలో పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను గురువారం స్వాధీనం చేసుకున్నారు. పిల్లర్ నంబర్-294 సమీపంలో ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా పేలుళ్లు జరుపుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడి చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు వాడే జిలెటిన్ స్టిక్స్ భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం, మొరంపల్లి వద్ద పోలీసులు గురువారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా పేలుడు పదార్థాలతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఆ పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంతకల్లులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
గుంతకల్లు పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహాణలో భాగంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 50 డిటోనేటర్లు, 10 కేజీల అమ్మెనియంను స్వాధీనం చేసుకున్నారు. ఆ పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఐదురుగు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను గుంతకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.