హైదరాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు
Published Sat, May 27 2017 4:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గ నగర్ వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన బొలెరోను తనిఖీ చేసి అందులో ఉన్న 2 వేల జిలెటిన్ స్టిక్స్, 2 వేల డిటోనెటర్స్ స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు.
Advertisement
Advertisement