
ఫుజైరా: ఒమన్ సింధుశాఖ వద్ద గతవారం జపాన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై పేలుడు కోసం వాడిన మందుపాతర ఇరాన్‌దేనని అమెరికా బుధవారం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అమెరికా నౌకాదళంలో సెంట్రల్ కమాండ్ కమాండర్ సియాన్ మాట్లాడుతూ ‘జపాన్ నౌకపై పేలుడు కోసం వాడిన మందుపాతరకు, గతంలో ఇరాన్ తమ సైనిక కవాతుల్లో ప్రదర్శించిన మందుపాతరలకు చాలా పోలికలు ఉన్నాయి. అలాగే జపాన్ నౌకపై దాడికి వచ్చిన వారి వేలిముద్రలు సహా బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment