
కాళేశ్వరం/గడ్చిరోలి: తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే కార్డెక్స్ వైర్ బండల్స్‌ను సరఫరా చేస్తున్న నలుగురు ఆదివారం గడ్చిరోలి జిల్లా పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ అంకిత్‌గోయల్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అహేరి తాలూకా దామ్రాంచ–బంగారంపేట గ్రామాల అటవీ ప్రాంతాల మీదుగా 20 కార్డెక్స్ వైర్ బండిల్స్ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పీఎస్సై సచిన్ ఘడ్కే ఆధ్వర్యంలో క్యూఆర్టీ పోలీసుల బలగాలతో మాటువేసి పట్టుకున్నారు.
మావోయిస్టు సానుభూతిపరులైన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజుగోపాల్ సల్ల, మహ్మద్ ఖాసీం షాదుల్లా, గడ్చిరోలి జిల్లాకు చెందిన కాశీనాథ్, సాధుల లచ్చాతలండి పట్టుబడగా, వీరి నుంచి 3,500 కార్డెక్స్ వైర్ బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వీటిని వివిధ లాంచర్లు, హ్యాండ్‌గ్రనేడ్లు, ఐఈడీఎస్ తయారీలో ఉపయోగిస్తున్నారని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment