
స్నేహలత
జగద్గిరిగుట్ట: అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట మహాత్మాగాంధీనగర్‌కు చెందిన మునుగల రామిరెడ్డి కుమార్తె స్నేహలత (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా ఈ నెల 17న ఉదయం 11 గంటల ప్రాంతంలో వారి ఇంటికి సంబంధించిన మెట్లు ఊడ్చేందుకు బయటకు వెళ్లిన యువతి కనిపించలేదు.
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే అదేరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆ యువతి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి నా వద్దనే ఉంది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అయితే మరలా సదరు నంబర్‌కు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: నాయబ్.. సీనియారిటీ గాయబ్!)
Comments
Please login to add a commentAdd a comment