జగద్గిరిగుట్టలో వ్యభిచార గృహాలపై దాడి | Hyderabad Police Raid In Home Against Illegal Activities | Sakshi
Sakshi News home page

జగద్గిరిగుట్టలో వ్యభిచార గృహాలపై దాడి

Mar 7 2021 11:20 AM | Updated on Mar 7 2021 1:21 PM

Hyderabad Police Raid In Home Against Illegal Activities - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సెల్‌ఫోన్‌ ద్వారా విటులకు ఫోన్‌చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకులతో పాటు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జగద్గిరిగుట్ట: వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసుల దాడులు నిర్వహించి నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పీఎస్‌ పరిధిలో  చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గాజులరామారంలోని మహదేవపురం కాలనీలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసుల శనివారం అడ్డాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సెల్‌ఫోన్‌ ద్వారా విటులకు ఫోన్‌చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకులతో పాటు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బాలానగర్‌ లోని వ్యభిచార గృహంపై బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడిచేసిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాలానగర్‌ ఎస్‌వోటి ఇన్‌ స్పెక్టర్‌ రమణారెడ్డి తెలిపిన వివరాలు.. జగద్గిరిగుట్ట పీఎస్‌ పరిధిలోని కమల ప్రసూన నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యభిచార గృహం నిర్వాహకుడు హరీష్‌ (38), విటుడు విజేందర్‌ (26)లతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. హరీష్, విజేందర్‌లపై కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను రెస్క్యూహోంకు తరలించారు.

చదవండి: కుటుంబ తగాదాలు.. అన్న, అక్క దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement