
భర్తకు మెసేజ్ చేసి భార్య అదృశ్యం
హైదరాబాద్: ‘నేను ఇంటికి రాను..నన్ను మరిచిపో’ అని భర్తకు మెసేజ్ చేసి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాయిబాబానగర్ పాండుబస్తీలో రమేష్, మీనాక్షి దంపతులు నివాసం ఉంటున్నారు. మీనాక్షి స్థానికంగా కూరగాయల దుకాణం నిర్వహించేది. ఈ నెల 16న సాయంత్రం ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది.
సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వచి్చన రమేష్ భార్య కనిపించకపోవడంతో ఆమె సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అయితే రాత్రి 10.45 గంటలకు ‘నేను ఇంటికి రాను.. నన్ను మరిచిపో’ అంటూ ఆమె భర్తకు మెసేజ్ పంపింది. దీంతో రమేష్ తన భార్య కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment