subhashnagar
-
‘నేను ఇంటికి రాను.. నన్ను మరిచిపో’
హైదరాబాద్: ‘నేను ఇంటికి రాను..నన్ను మరిచిపో’ అని భర్తకు మెసేజ్ చేసి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాయిబాబానగర్ పాండుబస్తీలో రమేష్, మీనాక్షి దంపతులు నివాసం ఉంటున్నారు. మీనాక్షి స్థానికంగా కూరగాయల దుకాణం నిర్వహించేది. ఈ నెల 16న సాయంత్రం ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది.సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన రమేష్ భార్య కనిపించకపోవడంతో ఆమె సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అయితే రాత్రి 10.45 గంటలకు ‘నేను ఇంటికి రాను.. నన్ను మరిచిపో’ అంటూ ఆమె భర్తకు మెసేజ్ పంపింది. దీంతో రమేష్ తన భార్య కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సుభాష్‌నగర్‌లో ‘నేను సైతం’
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని సుభాష్ నగర్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీవాసులు ముందుకొచ్చారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు ఇందుకు అంగీకరించారు. కాలనీలో బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ జరిగింది. సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. -
పెట్రోల్ తక్కువ పోస్తున్నారని గొడవ
సుభాష్‌నగర్: జీడిమెట్ల డిపో సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో టాటా మోటార్స్ ఉద్యోగి రాజేష్ గురువారం ఉదయం 9.30కి రూ.30 పెట్రోల్ పోయించుకున్నాడు. 50 మీటర్ల దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది. ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ వద్దకు వెళ్లగా ట్యాంక్‌లో ఒక్క చుక్క కూడా పెట్రోల్ లేదని చెప్పాడు. దీంతో రాజేష్ సదరు పెట్రోల్ బంక్ సిబ్బంది నిలదీయగా... ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాజేష్‌కు చెందిన రూ.25 వేల సెల్‌ఫోన్ ధ్వంసమైంది. ఇంతలోనే మరో ఇద్దరు యువకులు ఈ పెట్రోల్ బంక్‌లో రీడింగ్ కంటే తక్కువ పెట్రోల్ పోస్తున్నారని సిబ్బందితో మరోసారి గొడవకు దిగారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకోవడంతో జీడిమెట్ల పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ పెట్రోల్ బంక్ సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.