సాక్షి, గద్వాల: పట్టణంలోని కృష్ణారెడ్డిబంగ్లా కాలనీకి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ భార్య రవళి (25) గురువారం నదీ అగ్రహారం సమీపంలోని కృష్ణానదిలో గల్లంతు అయ్యింది. ఈ మెతో పాటు నదిలో మునిగిపోయిన ఆమె పిల్లలు ఆశ్రిత(6), అక్షిత్(4)తో పాటు తోడి కోడలు స్రవంతిలను అక్క డే ఉన్న స్థానికులు నదిలోకి దూకి రక్షించారు. ఆమె కోసం ఎంతవెతికినా ఆచూ కీ లభించలేక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రవళి బంధువుల్లోని ఓ వ్యక్తి దినకర్మలు బుధవారం ముగిశాయి. 8మంది మహిళలు, 6గురు చిన్నారులతో కలిసి కుటుంబసభ్యులు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కృష్ణానదిలో స్నానాలు చేసి పూజలు చేసేందుకు వెళ్లారు. అందరితో పాటు రవళి కూడా ఇద్దరు పిల్లలతో నదిలోకి దిగి పిల్లలకు స్నానం చేయిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో దుర్ఘటన చోటుచేసుకుంది.
గజఈతగాళ్లతో గాలింపు
విషయం తెలుసుకున్న డీఎస్పీ యాదగిరి, తహసీల్దార్ మంజూల, ఎస్‌ఐ సత్యనారాయణలు గజ ఈతగాళ్లతో సంఘట నా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో గజ ఈతగాళ్లుకు నదిలో వెళ్లేందుకు కాస్తా కష్టంగా మరింది. మహిళ కోసం దిగువ ప్రాంతంలోని అధికారులను డీఎస్పీ అప్రమత్తం చేశారు.
గాలింపు చర్యలు చేపడుతున్న గజ ఈతగాళ్లు , స్థానికుల సాయంతో బయటపడిన ముగ్గురు
Comments
Please login to add a commentAdd a comment