కృష్ణా (మక్తల్): మండల కేంద్రంలోని ధర్మశాల ప్రాంతంలో ఓ మొసలి శక్రవారం తెల్లవారుజామున ఏకంగా ఇంట్లోకి ప్రవేశించింది. దాంతో ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మశాల వీధి కృష్ణానది ఒడ్డునుంచి దాదాపు 100 అడుగుల దూరంలో ఉంటుంది. కాగా ప్రతి రోజు మాదిరిగానే అర్చకుడు గిరీష్‌జోషి తెల్లవారుజామున లేచి నదికి వెళ్దామని ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ఆవరణలో ఓ మూలన మొసలి కనిపించింది. దీంతో ఇంట్లో వారు భయబ్రాంతులకు గురై చుట్టు ప్రక్కల జనాలను పిలిచారు. ఆ ప్రాంతంలోని వ్యక్తులు చేపలు పట్టడంలో నిష్ణాతులవడంతో ఆ మొసలిని చాకచక్యంగా పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. విషయాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దానిని వారు స్వా«దీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా, నీటిని వదిలి జనవాసాల్లోకి మొసళ్లు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment