ప్రతీకాత్మక చిత్రం
వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని అమలపాడుకు చెందిన వివాహిత కర్ని లక్ష్మి అదృశ్యమై నెల రోజులు దాటినా ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు. వజ్రపుకొత్తూరు పోలీసులు గాలిస్తున్నా ఆమె ఎక్కడ ఉన్నారో అంతు పట్టడం లేదు. ఆమె బతికే ఉందా.. ఇంకేదైనా జరిగిందా అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోమవారం లక్ష్మి కుమారుడు నీలకంఠం శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. కర్ని లక్ష్మికి తన భర్త మాధవరావుతో ఐదేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి అమలపాడు గ్రామంలో నివాసముండగా, ఆమె భర్త మాధవరావు కొబ్బరి తోటలో ఇల్లు కట్టుకుని ఒంటరిగా ఉంటున్నారు. మార్చి 6వ తేదీ నుంచి లక్ష్మి కనిపించడం లేదు.
చదవండి: ఎడబాటు భరించలేక.. బదిలీ యత్నం ఫలించక.. సూసైడ్ నోట్ రాసి..
సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కుమారుడు ఎంతగా వెతికినా తల్లి ఆచూకీ లభించలేదు. దీంతో 15 రోజుల తర్వాత అతను వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాల్ డేటాను సైతం పరిశీలించి భర్త మాధవరావును కూ డా విచారించారు. ఇప్పటికి నెల దాటిపోయినా కేసు లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో లక్ష్మి కుమారుడు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌ను ఆశ్రయించాడు. గ్రామంలో కొందరిపై అనుమానంగా ఉందని, లో తుగా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని ఆయన చెబుతున్నాడు. దీనిపై వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ కూన గోవిందరావును ‘సాక్షి’ సంప్రదించగా తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భర్త ను కూడా విచారించామన్నారు. కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న వారిని మరోసారి విచారించి కేసును త్వరగా ఛేదిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment