ఉరవకొండ: వజ్రకరూర్ మండలం ఎన్‌ఎన్‌పీ తండాకు చెందిన వివాహిత అంజలీబాయ్ అదృశ్యమైంది. ఎస్‌ఐ జనార్థన్‌నాయుడు మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్‌ఎన్‌పీ తండాకు చెందిన సోమ్లానాయక్ కుమార్తె అంజలీబాయితో అదే గ్రామానికి చెందిన రమావత్ హరినాయక్‌తో కొన్ని నెలల క్రితం వివాహం అయింది. ఈ నెల 12న అత్తారింటి నుంచి బయటకు వెళ్లిన అంజలి తిరిగి రాలేదు. తల్లిదండ్రులతో పాటు భర్త అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె అదృశ్యమైనట్లు వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 9440901867ను సంప్రదించాలన్నారు.