
ఆశారాం బాపుపై ఫిర్యాదుచేసిన మహిళ అదృశ్యం
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై అత్యాచారం కేసు పెట్టిన మహిళ అదృశ్యమయ్యారు!! 33 ఏళ్ల ఆ మహిళతో పాటు ఆమె భర్త, కుమారుడు కూడా కనిపించడం లేదు. వారం రోజులుగా ఆ కుటుంబం మొత్తం కనిపించడం లేదని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. ఆశారాం బాపు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ గత సంవత్సరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాతే ఆశారాం బాపు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం లాంటి పరిణామాలు జరిగాయి. అయితే, ఇప్పుడు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళే కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం గుజరాత్ పోలీసులు ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశారు.