
ప్రతీకాత్మక చిత్రం
బాలానగర్: మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి రాని సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ ఎన్.డి.వాకింగ్ ఇన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్‌కు చెందిన ఎ.విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.
అతని కుమార్తె లావణ్య (20) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ నెల 7న సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!
Comments
Please login to add a commentAdd a comment