hyerabad
-
మూడు నెలల్లో నాలా పనులు పూర్తి చేయండి
ఎల్బీనగర్: జోనల్ పరిధిలో చేపట్టిన నాలా నిర్మాణ పనులను మూడు నెలలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో వరద ముంపు ప్రభావిత ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం రూ.858 కోట్లతో 52 పనులను చేపట్టిందని ఆమె తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పంకజతో కలిసి ఆమె నిర్వహించారు. సమావేశంలో ఎల్బీనగర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమయానికి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, రూ.114 కోట్లతో చేపట్టిన పనులు మూడు నెలలో పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు ఇవ్వొదని సీఈని మేయర్ ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద 14 పనులు చేపట్టామని, వాటిలో 6 పనులు పూర్తి కాగా , మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ››ఈ విషయంలో ఏఎంహెచ్‌ఓలదే పూర్తి బాధ్యత అని అన్నారు. జోనల్లో మరుగుదొడ్లు వంద శాతం అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో ఘన పదార్థాలు రోజు రోజుకూ పెరుగుతున్నందున సమర్థ నిర్వహణకు సర్కిళ్లలో ప్రత్యామ్నాయంగా రెండో స్థాలాన్ని చూసి ఉంచాలని డీసీలకు సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రధాన రహదారులకు ఉన్న లింకు రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈలు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, అశోక్‌రెడ్డి, సీపీ ప్రసాద్‌రావు, హార్టికల్చర్ డీడీ రాజ్‌కుమార్, ఈఈ ఎలక్ట్రికల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. వరదనీటి కాలువ పనుల పరిశీలన నాగోలు: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 103 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల (వరదనీటి కాలువ పనులు)ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎస్ఎన్డీపీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ చెరువు వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనులు పూర్తి అయితే నియోజకవర్గ పరిధిలోని కాలనీలు నీట మునిగే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆనంతులరాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ నాగోలు డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మా ఫోన్ రిపేర్ చేయించుకుని వస్తా’..! యువతి అదృశ్యం..
బాలానగర్: మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి రాని సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ ఎన్.డి.వాకింగ్ ఇన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్‌కు చెందిన ఎ.విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమార్తె లావణ్య (20) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ నెల 7న సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష! -
పది తలలతో ఏకాదశి రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు
-
మా ఇంటి నుంచి పోటీ చేయడం లేదు: మంత్రి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వరదలపై పక్క రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకు వచ్చినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు పేదల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. ఇక ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం 4,75,781 మందికి నేరుగా వరదసాయం అందజేసిందని మంత్రి తెలిపారు. అనంతరం మీసేవ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించామని, గత మూడురోజుల్లో రూ. 165 కోట్లు మీసేవ ద్వారా వరద బాధితులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ వరదసాయం నిలిపివేసినా, ఫలితాల అనంతరం ఈ మొత్తాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నేను ఫైటర్ని.. దేనికి భయపడను : కేసీఆర్) ప్రజలు ఆలోచించాలి ‘‘ప్రతిపక్షాలు టీఆర్ఎస్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్తే ప్రజలే తేల్చుతారు. స్వాతంత్రం వచ్చాక ఇక్కడ ఎన్నడూ జరగని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది. వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏమి చేసిందో హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. దేశంలోని ప్రతీ ఒక్కరూ నగరం వైపు చూస్తున్నారు. ఆధునాతన రోడ్లు, సీసీ కెమెరాలు, ఎల్ఈడీలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. భారతదేశంలో మేము కట్టిన ఇళ్లు ఎవరూ కట్టలేదు’’ అని మంత్రి తలసాని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఇక దుబ్బాకలో బీజేపీ విజయం నేపథ్యంలో... ఒక ఎన్నిక గెలిచిన్నంత మాత్రాన మొత్తం అదే ప్రపంచం అనుకుంటే ఎలా అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్నిరకాలుగా అడ్డుపడినా, ఎన్నికల తర్వాత ప్రజలకు వరద సాయం అందిస్తామని వెల్లడించారు. పోటీ చేయడం లేదు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తమ ఇంటి నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రజాస్వామ్యం లో పోటీ చేసే హక్కు అందరికి ఉంటుందని, మేయర్ అభ్యర్థిపై తమకు ఆశలు లేవని పేర్కొన్నారు. చిన్న వయసులోనే తన కుమారుడికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని, అదే ఎక్కువగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ బరిలో నిలపగా, ఆయన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
అబ్బా.. నిషా దెబ్బ
మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కోర్టు కొరడా ఝళిపించింది. పదే పదే పట్టుబడిన ఇద్దరు డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేసింది. మరో 13 మందివి నిర్ణీత కాలానికి సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 154 మందికి జైలు శిక్ష విధించింది. సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి భారీ వాహనాలు నడుపుతూ చిక్కిన, పదేపదే పట్టుబడుతున్న ‘నిషా’చరులపై న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరి డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తూ, మరో 13 మందివి నిర్ణీత కాలానికి సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి.రవీందర్ సోమవారం తెలిపారు. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో చిక్కిన 614 మంది మందుబాబులపై అధికారులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీరిని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్ అనంతరం కోర్టులో హాజరుపరిచారు. వాహనం నడిపే సమయంలో వీరు తీసుకున్న మద్యం మోతాదు, నడుపుతున్న వాహనరకం, గతంలో పట్టుబడిన చరిత్ర తదితరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 154 మందికి జైలు శిక్ష విధించింది. చంచల్‌గూడ జైలుకు వెళ్లిన వారిలో 21 మందికి పది రోజులు, ఒకరికి ఎనిమిది రోజులు, ముగ్గురికి వారం, నలుగురికి ఆరు రోజులు, 13 మందికి ఐదు రోజుల, 19 మందికి నాలుగు రోజులు, 15 మందికి మూడు రోజులు, 78 మందికి రెండు రోజులు జైలు శిక్షలు పడినట్లు రవీందర్ వివరించారు. వీరితో పాటు మిగిలిన వారికీ న్యాయస్థానం రూ.13.32 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసిన కోర్టు, ఐదుగురివి రెండేళ్ల పాటు, ముగ్గురివి ఏడాది, మరో ఐదుగురివి ఆరు నెలలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వివరించారు. సైబరాబాద్‌లో 315 డ్రంకన్ డ్రైవ్ కేసులు మద్యం తాగి బండి నడుపుతున్న డ్రంకన్ డ్రైవర్లపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీలోగా 315 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరిలో 12 మందికి ఒకటి నుంచి 12 రోజుల పాటు జైలు శిక్ష పడిందని తెలిపారు. -
ఎస్టీ యూ ధర్నాను విజయవంతం చే యాలి
నడిగూడెం : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 27 హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎస్టీయూ ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ధర్నా వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎండీ.సలీం షరీఫ్, ఎస్టీయూ మండల అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎండీ.జానిపాషా, నాయకులు చందూలాల్, శ్రీనివాస్, కవిత, రమాదేవి, పాల్గొన్నారు.