చిలమత్తూరు మండలం కొడికొండకు చెందిన డి.శ్రీనివాసులు భార్య అనిత అదృశ్యంపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు.
చిలమత్తూరు (హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండకు చెందిన డి.శ్రీనివాసులు భార్య అనిత అదృశ్యంపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు. తన ఇద్దరు పిల్లలను వదిలేసి, ఎనిమిది రోజుల నుంచి తమ కుమార్తె కనిపించడం లేదంటూ అనిత తండ్రి నారాయణస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
బాలిక అదృశ్యంపై..
తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలం సజ్జలదిన్నెకు చెందిన శ్రావణి(14) అదృశ్యంపై గురువారం కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈ నెల 16న బయటకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె ఇప్పటి వరకు తిరిగి రాలేదని ఆమె తండ్రి విజయ్ తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.